Monday, 16 March 2026 01:53:18 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

Araku Coffee: పార్లమెంట్‌లో మన అరకు కాఫీ ఘుమఘుమలు.. స్టాల్ ప్రారంభం..

ఇకపై పార్లమెంట్‌లో ఎంపీలంతా ఇకపై అరకు కాఫీని టేస్ట్‌ చెయ్యొచ్చు.. ఇందుకోసం సోమవారం క్యాంటీన్ సంగం-1లో అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి

Date : 24 March 2025 12:35 PM Views : 323

Studio18 News - తాజా వార్తలు / : ఇకపై పార్లమెంట్‌లో ఎంపీలంతా ఇకపై అరకు కాఫీని టేస్ట్‌ చెయ్యొచ్చు.. ఇందుకోసం సోమవారం క్యాంటీన్ సంగం-1లో అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ప్రారంభించారు.. కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువల్ ఓరం, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడితోపాటు కూటమి ఎంపీలంతా అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అవకాశం ఇవ్వడంతో… పార్లమెంట్‌ ఆవరణలో ఇవాళ్టి నుంచి అరకు కాఫీ స్టాల్‌ అందుబాటులోకి వచ్చింది. 2 కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద ఈ స్టాల్స్ ఏర్పాటు చేశారు.. దీనికి సంబంధించి ఇవ్వాల్టి నుంచి కాఫీ స్టాల్స్ అందుబాటులోకి రానున్నాయి.. కాఫీ స్టాల్స్‌ ప్రారంభం కోసం రెండ్రోజుల ముందే గిరిజన కోఆపరేటివ్‌ సొసైటీ అధికారులు ఢిల్లీకి వెళ్లారు. ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా అక్కడే ఉన్నారు. అరకు కాఫీకి ఈ స్థాయి గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏపీ గిరిజనుల కష్టాన్ని ప్రపంచం గుర్తించబోతున్నందుకు గర్వంగా కూడా ఉందని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :