Tuesday, 10 March 2026 03:46:51 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Honeytrap: అసెంబ్లీలో హనీట్రాప్ దుమారం.. మంత్రులు సహా 48మంది నేతలపై వలపు వల.. సీడీలు, వీడియోలు కూడా..

గతవారం ఓ బీజేపీ నేతపై జరిగిన హనీట్రాప్ ప్రయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన ఓ మహిళ..

Date : 21 March 2025 12:18 PM Views : 201

Studio18 News - తాజా వార్తలు / : Honeytrap Case: ఈ మధ్యకాలంలో మనం తరచుగా హనీట్రాప్ అనే పేరును వింటూనే ఉన్నాం. ఇప్పుడీ హనీట్రాప్ వలలో సుమారు 48మంది మంత్రులు సహా ఎమ్మెల్యేలు చిక్కుకున్నారని అసెంబ్లీలో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ అంశంపై దుమారం చెలరేగింది. విచారణ చేపట్టాలని అధికార, విపక్ష పార్టీల నేతలు పట్టుబట్టారు. దీంతో ఇప్పటికే ఈ హనీట్రాప్ పై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. కర్ణాటక అసెంబ్లీలో హనీట్రాప్ దుమారం చెలరేగింది. రాజకీయ నేతలను హనీట్రాప్ భయం వెంటాడుతోంది. తనపై రెండుసార్లు హనీట్రాప్ ప్రయత్నాలు జరిగాయని కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎస్ రాజన్న అన్నారు. అంతేకాక.. ఈ వ్యవహారంలో తనకు తెలిసే 48 మంది చిక్కుకుని ఉన్నారని అసెంబ్లీలో ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది. మంత్రి మాట్లాడుతూ.. తన దగ్గరున్న సమాచారం ప్రకారం మొత్తం 48 మంది రాజకీయ నేతలు హనీట్రాప్ వలలో చిక్కుకున్నారు. ఇది కొత్త విషయంకాదు. వాటిని బయటపెట్టకుండా కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చిన నాయకులు చాలా మంది ఉన్నారంటూ పేర్కొన్నారు. ఇప్పుడు నాపేరు ప్రస్తావనకు వచ్చింది. ఇదే అంశంపై ఫిర్యాదు చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. హనీట్రాప్ సూత్రదారులు, పాత్రదారులెవరో తెలుసుకోవాలని అన్నారు. రాజకీయ లబ్ధికోసమే ఇదంతా చేశారని పేర్కొన్నారు. వాళ్లకు సంబంధించిన సీడీలు, పెన్ డ్రైవ్ లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదన్నారు. బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సభలో మాట్లాడుతూ.. ప్రభుత్వమే హనీట్రాప్ ఫ్యాక్టరీ నిర్వహిస్తుందా అంటూ ప్రశ్నించారు. దీనిపై హోం మంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ.. హనీట్రాప్ అనుమానాలున్న సభ్యులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు. మరోవైపు ఇదే వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. ఎవరినైనా అరెస్టు చేశారో లేదోనన్న విషయం తనకు తెలియదన్నారు. దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. ఇదిలాఉంటే… గతవారం ఓ బీజేపీ నేతపై జరిగిన హనీట్రాప్ ప్రయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన ఓ మహిళ.. అసభ్యకర వీడియోలతో తనను బ్లాక్ మెయిల్ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :