Tuesday, 10 March 2026 03:45:35 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Delimitation: మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ చేయొద్దని జేఏసీ తీర్మానం.. ఎందుకో చెప్పిన కేటీఆర్, కనిమొళి

దక్షిణాది మొత్తం నష్టపోతుందని, జనాభా ఆధారంగా సీట్ల సంఖ్యను పెంచాలని అనుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని చెప్పారు.

Date : 22 March 2025 04:22 PM Views : 248

Studio18 News - తాజా వార్తలు / : తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం చెన్నైలో డీలిమిటేషన్‌పై మొదటి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పాల్గొన్నారు. కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు. తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా ఇందులో పాల్గొన్నారు. డీలిమిటేషన్‌పై జేఏపీ ఓ తీర్మానం చేసి ఆమోదించింది. పాతికేళ్ల వరకు నియోజకవర్గాల సంఖ్య పెంచొద్దని ఉన్న నిబంధనను మరో 25 సంవత్సరాలు పొడిగించాలని తీర్మానంలో పేర్కొంది. డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం పారదర్శకతను పాటించాలని జేఏసీ చెప్పింది. జేఏసీ తీర్మానాన్ని డీఎంకే ఎంపీ కనిమొళి చదివి వినిపించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఏ డీలిమిటేషన్ ప్రక్రియ అయినా ప్రజాస్వామ్యాన్ని మరింత బలపర్చేలా పారదర్శకంగా ఉండాలని చెప్పారు. అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలకు దానిపై చర్చించడానికి వీలు కల్పించాలని అన్నారు.

కాగా, డీలిమిటేషన్‌పై మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. నియోజక వర్గాల పునర్విభజనను ప్రశ్నించకపోతే తమను చరిత్ర క్షమించదని చెప్పారు. దీనిపై అన్ని రాష్ట్రాలు ఏకమవ్వాలన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందని చెప్పారు. ఈ రాష్ట్రాలపై కేంద్ర సర్కారు వివక్ష చూపుతోందని తెలిపారు. దాని వల్ల తెలంగాణలోనూ నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది మొత్తం నష్టపోతుందని, జనాభా ఆధారంగా సీట్ల సంఖ్యను పెంచాలని అనుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని చెప్పారు. అభివృద్ధిలో మందున్న రాష్ట్రాలకు దీని వల్ల నష్టం జరుగుతుందని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం పని చేసిన రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుందని అన్నారు. మనమంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని చెప్పారు. దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ… దేశాన్ని వెనక్కి నడుస్తున్న రాష్ట్రాలకి ఈ డిలిమిటేషన్ విధానం లాభం చేకూరుస్తుందని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :