Tuesday, 10 March 2026 03:48:27 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Railway Info: హైదరాబాద్ – చెన్నై మధ్య ట్రావెల్ చేసే రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్..

Railway Info: హైదరాబాద్ – చెన్నై మధ్య ట్రావెల్ చేసే రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్..

Date : 08 March 2025 05:29 PM Views : 294

Studio18 News - తాజా వార్తలు / : Railway News: హైదరాబాద్ – చెన్నై మధ్య రెగ్యులర్‌గా ట్రావెల్ చేసే రైల్వే ప్రయాణీకులకు కీలక అప్‌డేట్ ఇది. ప్రతి రోజూ హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభ స్థానం మారింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు చర్లపల్లి నుంచి బయలుదేరి వెళ్లనున్నాయి. అలాగే ఎదురుదిశలో చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చే ఈ ఎక్స్‌ప్రెస్ ఇకపై చర్లపల్లి వరకే వస్తుంది. ఆ మేరకు చెన్నై సెంట్రల్‌ – హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం.12603)ను చెన్నై సెంట్రల్‌ – చర్లపల్లిగా రైల్వే శాఖ మార్చింది. ఈ నిర్ణయం శుక్రవారం (మార్చి 7) నుంచే అమల్లోకి వచ్చింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు చెన్నై సెంట్రల్ నుంచి మధ్యాహ్నం 04.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.10 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. అలాగే హైదరాబాద్‌-చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం.12604)ను చర్లపల్లి – చెన్నై సెంట్రల్‌గా మారింది. ఈ మార్పు శనివారం (మార్చి 8) నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజూ సాయంత్రం 05.25 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.40 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. అలాగే గోరఖ్‌పుర్‌-సికింద్రాబాద్, సికింద్రాబాద్‌-గోరఖ్‌పుర్‌ ఎక్స్‌‌ప్రెస్ రైళ్లు (నెం.12589, 12590) గోరఖ్‌పుర్‌-చర్లపల్లి, చర్లపల్లి-గోరఖ్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌గా మారాయి. మార్చి 12, 13 తేదీల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ద.మ.రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :