Tuesday, 10 March 2026 03:46:47 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Lado Lakshmi Yojana : మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతినెలా రూ. 2,100 మీ ఖాతాలోకి.. ఈ పథకం ఎలా పొందాలంటే?

Lado Lakshmi Yojana : 2025-26 సంవత్సరానికి లాడో లక్ష్మీ యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100 సహాయాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది.

Date : 21 March 2025 11:26 AM Views : 220

Studio18 News - తాజా వార్తలు / : Lado Lakshmi Yojana : మహిళలకు గుడ్ న్యూస్.. ఇకపై రాష్ట్ర మహిళలకు ప్రతి నెలా రూ.2100 ఆర్థిక సాయం అందనుంది. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ 2025-26 సంవత్సరానికి రూ.2.05 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ సందర్భంగా సైనీ మాట్లాడుతూ.. ‘లాడో లక్ష్మీ యోజన’ కోసం ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించిందని చెప్పారు.

2025-26 సంవత్సరానికి లాడో లక్ష్మీ యోజన పథకం కింద రాష్ట్ర మహిళలకు నెలకు రూ.2,100 సహాయం అందించాలని హర్యానా ప్రభుత్వం ప్రతిపాదించింది. 2024 అక్టోబర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ మహిళలకు ప్రతి నెలా ఆర్థిక సాయం అందుతుందని వాగ్దానం చేసింది. బడ్జెట్‌ సందర్భంగా రాష్ట్ర సీఎం మాట్లాడుతూ.. ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపులు జరిగాయని, త్వరలోనే తుది రూపం దాల్చుతోందని అన్నారు. ఈ పథకానికి సంబంధించి అన్ని పూర్తి అయిన తర్వాత మంత్రివర్గం ముందు ఉంచుతామని ఆయన అన్నారు. లాడో లక్ష్మి యోజన దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (BPL) కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. లాడో లక్ష్మీ యోజన పథకం ప్రయోజనాలివే.. : ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే.. మీరు వెంటనే అంత్యోదయ-సరల్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ పోర్టల్‌లో మీ పేరు, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వంటి వివరాలను సమర్పించాలి.

మహిళలు రూ. 1,80,000 కన్నా తక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉంటే.. దారిద్య్రరేఖకు దిగువన (BPL) ఉంటారు. BPL కార్డు లేని వారు ఈ పథకం ప్రయోజనాలను పొందలేరని గమనించాలి. లాడో లక్ష్మీ యోజన ప్రయోజనాలను పొందాలంటే ముందుగా మహిళలు పరివార్ పెహచన్ పత్ర (PPP)ని సమర్పించాల్సి రావచ్చు. అయితే, కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా సరళ్ సెంటర్ లేదా (PPP) ఆపరేటర్ వద్ద పూర్తి చేయవచ్చు. కుటుంబంలోని అర్హత కలిగిన మహిళ బ్యాంకు అకౌంట్ తమ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి. మహిళల ఖాతాలోకి నేరుగా రూ. 2100 జమ అవుతుంది. మీ ఆధార్‌ను బ్యాంకు అకౌంటుతో లింక్ చేయడం చాలా ముఖ్యం. బ్యాంకు సమీప బ్రాంచ్‌కు వెళ్లి మీ బ్యాంకు అకౌంటుతో ఆధార్ లింక్ చేసుకోవచ్చు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :