Tuesday, 10 March 2026 03:46:47 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Delimitation: వాళ్లలా మోదీ డీలిమిటేషన్ చేయాలి.. ఈ పద్ధతి పాటిస్తే సరీ..: రేవంత్‌ రెడ్డి

మోదీ పాతికేళ్ల వరకు నియోజకవర్గాల సంఖ్య పెంచొద్దని రేవంత్‌ రెడ్డి చెప్పారు.

Date : 22 March 2025 04:25 PM Views : 218

Studio18 News - తాజా వార్తలు / : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్‌)పై ఇవాళ చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశం ద్వారా కేంద్రం దృష్టికి 3 పాయింట్లను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇందిరాగాంధీ, వాజ్ పేయి చేసినట్టు నియోజకవర్గాలు పెంచకుండా డీలిమిటేషన్ చేయాలని అన్నారు. మోదీ కూడా వారిలాగే డీలిమిటేషన్ చేయాలని చెప్పారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ కు దక్షిణాది ఒప్పుకోదని అన్నారు. ఒకవేళ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది పొలిటికల్ వాయిస్ కోల్పోతుందని చెప్పారు.

ఉత్తరాది వారు దక్షిణాది వారిని సెకండరీ సిటిజన్ గా చూస్తారని, యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలను డామినేట్ చేస్తాయని అన్నారు. దీన్ని దక్షిణాదిన అన్ని పార్టీలు ఏకమై అడ్డుకోవాలని చెప్పారు. ప్రో రేటా ఫార్ములా ప్రకారం కూడా నియోజకవర్గాల పునర్విభజనకు ఒప్పుకోబోమని అన్నారు. అలాగే, మోదీ పాతికేళ్ల వరకు నియోజకవర్గాల సంఖ్య పెంచొద్దని రేవంత్‌ రెడ్డి చెప్పారు. తాజా జనాభా గణాకాంల ఆధారంగా రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని నియోజకవర్గాలను పునర్విభజించాలని అన్నారు. మల్కాజ్ గిరి లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం నుంచి గతంలో తాను ప్రాతినిధ్యం వహించానని, అక్కడ జనాభా 45 లక్షలని, అలాంటి వాటిని మార్చాలని చెప్పారు. ఒకవేళ కేంద్రం డీలిమిటేషన్ చేస్తే.. ప్రస్తుతం 543 ఉన్న లోక్ సభ స్థానాల్లో దక్షిణాదికి 130 సీట్లు (24%) ఉన్నాయని, దీన్ని 33 శాతానికి పెంచాలని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :