Studio18 News - తాజా వార్తలు / : Amaravati : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టారు మంత్రి నారాయణ. ఇవాళ ఆయన అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఐఏఎస్ బంగ్లాలను పరిశీలించారు. అధికారుల కోసం 115 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. సెక్రటరీలకు 90 భవనాలు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు 25 భవనాలు నిర్మిస్తున్నారు. వచ్చే నెల నుంచి అమరావతి నిర్మాణ పనులను పున: ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఏప్రిల్ ప్రధాని మోదీ ఈ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని మంత్రి నారాయణ చెప్పారు. అమరావతి నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసామన్నారు మంత్రి నారాయణ. రానున్న మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు. రాజధాని నిర్మాణం కోసం 31వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. కాగా అమరావతి నిర్మాణానికి ప్రజల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయము అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ప్రజలపై ఒక్క పైసా భారం పడకుండా రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేశాక భూమి అమ్మి అప్పులు తీరుస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.
Admin
Studio18 News