Monday, 16 March 2026 01:54:52 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

Rajasthan: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన.. వెండి నగల కోసం వృద్ధురాలిని మంచంతో సహా ఎత్తుకెళ్లిన దొంగలు

Date : 06 February 2026 07:51 PM Views : 45

Studio18 News - తాజా వార్తలు / : కిలోన్నర వెండి నగల కోసం 90 ఏళ్ల వృద్ధురాలి కిడ్నాప్ మంచంతో సహా ఎత్తుకెళ్లి పొలంలో పడేసిన దొంగలు అప్రమత్తమైన కుటుంబసభ్యులు, గ్రామస్థులు.. విఫలమైన చోరీ యత్నం రాజస్థాన్‌లో వరుస ఘటనలతో గ్రామీణ మహిళల్లో తీవ్ర ఆందోళన వెండి ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ, దొంగలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో జరిగిన ఓ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సుమారు కిలోన్నర బరువున్న వెండి ఆభరణాల కోసం 90 ఏళ్ల వృద్ధురాలిని ఆమె పడుకున్న మంచంతో సహా ఎత్తుకెళ్లారు. ఈ షాకింగ్‌ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... భిల్వారా జిల్లా అర్వాడ్ ప్రాంతంలోని కోఠియా గ్రామంలో మాజీ సర్పంచ్ నత్తి దేవి మాలి ఇంట్లోకి బుధవారం రాత్రి దొంగలు చొరబడ్డారు. ముందుగా ఇంట్లోని వారిని గదుల్లో బంధించి బయట గడియ పెట్టారు. ఆ సమయంలో వరండాలో మంచంపై నిద్రిస్తున్న నత్తి దేవి అత్తగారైన 90 ఏళ్ల ఛోటీ దేవిని గమనించారు. ఆమె ఒంటిపై భారీగా వెండి ఆభరణాలు ఉండటంతో నోరు నొక్కి మంచంతో పాటు సమీపంలోని పొలంలోకి ఎత్తుకెళ్లారు. అక్కడ ఆమె కాళ్లు, చేతులు కట్టేసి నగలు దోచుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో గదుల్లో బంధించిన కుటుంబసభ్యులు కేకలు వేయడంతో చుట్టుపక్కల గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. గదుల తాళాలు పగలగొట్టి వారిని బయటకు తీశారు. ఇంట్లో ఛోటీ దేవి కనిపించకపోవడంతో వెంటనే గాలింపు చేపట్టగా, పొలంలో నిస్సహాయ స్థితిలో పడి ఉన్న వృద్ధురాలిని గుర్తించారు. అయితే, గ్రామస్థులు అప్రమత్తమవడంతో దొంగలు నగలు తీసుకోకుండానే పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వెండి ధరలు విపరీతంగా పెరగడమే ఇలాంటి నేరాలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా, మంగళవారం సవాయ్ మాధోపూర్ జిల్లాలో వెండి కడియాల కోసం ఓ మహిళ కాళ్లను నరికి చంపేశారు. ఈ వరుస ఘటనలతో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :