Tuesday, 10 March 2026 03:49:06 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Bird Flu: తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. 30వేల కోళ్లను చంపి..

తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం ప్రజలు ఆందోళనకు గురిచేస్తోంది. వేలాది కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో ..

Date : 22 March 2025 08:58 AM Views : 225

Studio18 News - తాజా వార్తలు / : Bird Flu: తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం చెలరేగింది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత నెలలో బర్డ్ ఫ్లూ కారణంగా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ భారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫౌల్టీఫామ్ యాజమానులకు, ప్రజలకు సూచనలు చేసింది. ఆ సమయంలో చికెన్ విక్రయాలు భారీగా తగ్గిపోయాయి. అయితే, కొద్దిరోజులకే బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గిపోవటంతో మళ్లీ రాష్ట్రంలో యథాపరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజులకే మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం చెలరేగడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.

యాదాద్రి జిల్లాలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెంలోని ఓ కోళ్లఫామ్ లో ఇటీవల వందల కోళ్లు చనిపోయాయి. విషయం తెలుసుకున్న వెటర్నరీ అధికారులు శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపడంతో బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. దీంతో జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి జానయ్య, మరో 30మంది వైద్యులతో కూడిన బృందం శుక్రవారం కోళ్లఫామ్ వద్దకు చేరుకున్నారు.

వైద్యులు, సిబ్బంది పీపీఈ కిట్లు, మాస్క్ లు ధరించి ఫామ్ లోకి వెళ్లి మొత్తం 29,796 కోళ్లను చంపేసి సంచుల్లో ప్యాక్ చేశారు. అనంతరం గొయ్యి తీసి వాటిని పాతిపెట్టారు. ఫాంలోని దాదాపు 20వేల కోడిగుడ్లను, కోళ్లకు సంబంధించిన వ్యర్థాలను కూడా పూడ్చిపెట్టారు. కోళ్ల ఫాంలో ఉన్న దాణాను సీజ్ చేశారు. ఫామ్ ను పదిహేను రోజులకు ఒకసారి శానిటైజ్ చేయించాలని, మూడు నెలల పాటు కోళ్లను పెంచవద్దని కోళ్లఫాం యాజమానులకు అధికారులు సూచించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :