Monday, 16 March 2026 01:54:05 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

JD Chakravarthy: 'బరాబర్' బాధపడుతున్నా... నేను ఆ ఈవెంట్ మధ్యలోనే వచ్చేసి ఉండాల్సింది: జేడీ చక్రవర్తి

Date : 04 February 2026 06:25 PM Views : 25

Studio18 News - తాజా వార్తలు / : ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌పై జేడీ చక్రవర్తి ఆవేదన ప్రచారం కోసం దిగజారడం అవసరం లేదన్న ప్రముఖ నటుడు మధ్యలోనే రావాల్సిందని ఇప్పుడు బాధపడుతున్నానంటూ వ్యాఖ్య క్రియేటివిటీతో ఆకట్టుకోవాలి కానీ రోత పుట్టించొద్దని హితవు ఈ మేరకు తన అభిప్రాయాన్ని తెలుపుతూ వీడియో విడుదల ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి ఇటీవల సినిమా ప్రమోషన్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను అతిథిగా హాజరైన ఓ సినిమా ఫంక్షన్‌లో జరిగిన ఘటన తనను తీవ్రంగా బాధించిందని, అక్కడి నుంచి మధ్యలోనే వచ్చేసి ఉండాల్సిందని ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, "సినిమాలకు ప్రచారం కల్పించుకోవడానికి ఘోరంగా దిగజారిపోవాల్సిన అవసరం లేదని నేను నమ్ముతాను. ఇటీవల నేను అతిథిగా వెళ్లిన ఒక సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయాను. అక్కడి నుంచి మధ్యలోనే తిరిగి వచ్చేయాల్సింది. ఇప్పుడు దాని గురించి 'బరాబర్' బాధపడుతున్నాను" అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు సృజనాత్మక మార్గాలను ఎంచుకోవాలని, అంతే కానీ అసభ్యకరమైన చేష్టలతో కాదని ఆయన హితవు పలికారు. "సృజనాత్మకమైన ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి తప్ప, రోత పుట్టించే జుగుప్సాకరమైన వేష, భాషలతో కాదని నేను బలంగా విశ్వసిస్తాను," అని జేడీ చక్రవర్తి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొన్ని రోజుల కిందట ఓ సినిమా ఈవెంట్ లో వేదికపై బూతులతో కూడిన పాట పాడడం తీవ్ర విమర్శలకు దారితీయడం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :