Tuesday, 10 March 2026 03:43:56 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Employee Provident Fund: పీఎఫ్ విత్ డ్రా చేస్తే పన్ను కట్టాలా.. నిబంధనలు ఏంచెబుతున్నాయంటే!

Date : 13 November 2025 06:38 PM Views : 135

Studio18 News - తాజా వార్తలు / : పీఎఫ్ విత్ డ్రాను సులభతరం చేసిన కేంద్రం డ్రా చేసుకునే ఆప్షన్ల సంఖ్య పెంపు అత్యవసరమైతే తప్ప విత్ డ్రా చేయొద్దంటున్న నిపుణులు ఉద్యోగ భవిష్య నిధి (ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్– ఈపీఎఫ్) లోని సొమ్మును విత్ డ్రా చేసుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఈపీఎఫ్ ఆఫీసు దాకా వెళ్లాల్సిన అవసరంలేకుండా మొబైల్ ఫోన్ ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పించింది. విత్ డ్రాకు ఉన్న పరిమిత ఆప్షన్లకు మరికొన్నింటిని జోడించింది. దీంతో పీఎఫ్ విత్ డ్రా చేసుకోవడం ఈజీగా మారింది. అయితే, ఇలా విత్ డ్రా చేస్తున్న సొమ్ముకు పన్ను చెల్లించాలా.. అంటే అక్కర్లేదనే నిపుణులు చెబుతున్నారు. అయితే, భవిష్యత్ అవసరాల కోసం దాచుకునే ఈ సొమ్మును అత్యవసరమైతే తప్ప విత్ డ్రా చేయొద్దని కూడా వారు సూచిస్తున్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా నిబంధనలలో మార్పులు చేసింది. విత్ డ్రా చేసిన మొత్తంపై పన్ను ఎప్పుడంటే.. ఉద్యోగంలో చేరిన ఐదేళ్లలోపు పీఎఫ్ నుంచి సొమ్ము విత్ డ్రా చేస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. ఉద్యోగం మారిన సందర్భాలలో రెండు సంస్థల్లో పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పాత సంస్థలో వినియోగించిన పీఎఫ్ ఖాతాను కొత్త సంస్థకు బదిలీ చేసిన సందర్భంలోనే ఈ రూల్ వర్తిస్తుంది. కొత్త ఖాతా తెరిస్తే మళ్లీ మొదటి నుంచే లెక్కిస్తారు. ఈపీఎఫ్ లో యజమాని వాటా కింద జమ అయిన మొత్తంతో పాటు డిపాజిట్ పై వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి ఆదాయాన్ని బట్టి పన్ను శ్లాబు వర్తిస్తుంది. ఆదాయపు పన్ను శాఖకు పాన్ కార్డు వివరాలు సమర్పించకపోతే 34.60 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఐదేళ్లకు మించిన ఈపీఎఫ్ ఖాతాల్లోని డిపాజిట్ మొత్తంలో రూ.1.50 లక్షల వరకు (పాత పన్ను విధానంలో) పన్ను మినహాయింపు పొందొచ్చు. కొత్త పన్ను విధానంలో కేవలం యజమాని వాటాపై మాత్రమే మినహాయింపు లభిస్తుంది. రెండు విధానాల్లోనూ ఈపీఎఫ్‌ ఖాతాలోని నగదు నిల్వలు, మెచ్యూరిటీ సొమ్ము పూర్తిగా పన్ను రహితం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :