Studio18 News - తాజా వార్తలు / : AP Telangana : అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీ మెక్ డొనాల్డ్స్ తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 2వేల మంది ఉద్యోగులతో ఆఫీస్ ను ప్రారంభించనుంది మెక్ డొనాల్డ్స్. అసెంబ్లీలోని ఛాంబర్ లో మెక్ డొనాల్డ్స్ ఛైర్మన్, సీఈవో క్రిస్ తో పాటు సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం చేసుకున్నారు. గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటు చేస్తుండటంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవడం గర్వంగా ఉందన్నారాయన. ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్ డొనాల్డ్స్ ఔట్ లెట్స్ ఉన్నాయి. ప్రతీ ఏడాది 3 లేదా 4 కొత్త ఔట్ లెట్లను విస్తరించే ప్రణాళికను రూపొందిస్తున్నారు. కొత్తగా గ్లోబల్ ఇండియా ఆఫీస్ ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
Admin
Studio18 News