Tuesday, 10 March 2026 03:45:34 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Ugadi Special: మామిడి సీజన్ వచ్చేసింది.. ఉగాది రోజున మామిడికాయతో పులిహోర చేసి చూడండి.. రెసిపీ మీ కోసం

Date : 24 March 2025 10:33 AM Views : 206

Studio18 News - తాజా వార్తలు / : మామిడికాయల సీజన్ వచ్చేసింది. ఉగాది పచ్చడిలో మామిడి కాయ ఒక ప్రధాన వస్తువు. అప్పటి నుంచి పచ్చి మామిడి కాయతో రకరకాల ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. మామిడి కాయ పప్పు, మామిడి కాయ పప్పు, మామిడి కాయ పచ్చడి.. వంటి రకరకాల ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. అయితే ఉగాది రోజున పులిహోర ను మామిడి కాయతో చేస్తే.. పిల్లలు పెద్దలు ఆహా ఏమి రుచి అంటూ తినాల్సిందే. ఈ రోజు మామిడి కాయ పులి హోర రెసిపీ గురించి తెలుసుకుందాం..

వేసవి కాలం వచ్చేసింది. మామిడి కాయాలు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. పచ్చి మామిడి కాయతో రకరరకాల వంటకాలను తయారు చేస్తారు. వాటిల్లో ఒకటి మామిడి కాయ. ఉగాది పండగ రోజున సంప్రదాయ వంటకంగా పులిహోర కచ్చితంగా ఉంటుంది. అందరూ ఇష్టంగా ఇనే పులిహోరను చింత పండు, నిమ్మ రసం, డబ్బకాయ రసం వంటి వాటితో కొంతమంది తయారు చేసుకుంటే.. మరికొందరు నిమ్మ ఉప్పుతో కూడా చేస్తున్నారు. అయితే అందరూ ఇష్టంగా తినే పులిహోరను మామిడికాయతో చేస్తే దాని రుచిని వర్ణించడం సాధ్యమా అనిపిస్తుంది. ఉగాది రోజున మామిడికాయ పులిహోరను ట్రై చేసి చూడండి. ఈ రోజు మామిడి పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఏ విధంగా తయారు చేయాలి? తెలుసుకుందాం. కావాల్సిన పదార్ధాలు: బియ్యం – అరకిలో పుల్లని పచ్చి మామిడి కాయ – ఒకటి

పసుపు పచ్చి మిర్చి ఎండు మిరపకాయలు శనగ పప్పు మినప పప్పు ఆవాలు కరివేపాకు ఇంగువ వేరుశనగ గుళ్ళు జీడి పప్పు నూనె – సరిపడా ఉప్పు – రుచికి సరిపడా తయారీ విధానం: ముందుగా తీసుకున్న బియ్యాన్ని కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని తగినంత నీరు పోసి అందులో కొంచెం నూనె, పసుపు వేసి నీరు మరిగిన తర్వాత బియ్యం పోసుకుని అన్నం వండుకోవాలి. అయితే అన్నం కొంచెం పలుకుగా ఉండేలా చూసుకుని గంజి వార్చుకోవాలి. ఇప్పుడు పచ్చి మామిడి కాయను తీసుకుని దాని తొక్క తీసి.. కోరుగా తురుముకుని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టి.. దానిలో తగినంత నూనె వేసి నూనె కాగిన తర్వాత ఎండు మిర్చి ముక్కలు, వేరు శనగ గుళ్ళు, పచ్చి శనగ పప్పు, మినప పప్పు, ఆవాలు, కరివేపాకు, నిలువుగా కట్ చేసిన పచ్చి మిర్చి వేసుకుని వేయించాలి. ఇప్పుడు ఇంగువ వేసి వేగిన తర్వాత జీడిపప్పు వేసుకుని వేయించాలి. ఇందులో కొంచెం మిడి తురుము , ఉప్పు వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం ఒక పళ్ళెంలో వేసుకుని.. అందులో కొంచెం నూనె, పసుపు, కొంచెం కరివేపాకు తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న మామిడి తురుముని వేసుకుని గరిటతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పులిహోర పోపు కోసం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని రెడీ చేసుకున్న అన్నంలోకి వేసుకుని గరిటతో కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మామిడి కాయ పులిహోర రెడీ.. ఇంకెందుకు ఆలస్యం. ఈ మామిడి కాయ సీజన్​లో ఉగాది పండగ రోజున ఈ పులిహోరను తయారు చేసుకోండి. ఇంటిల్లపాది పండగను ఎంజాయ్ చేస్తారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :