Monday, 16 March 2026 01:53:16 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

MF Hussain: ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

1950లలో ‘గ్రామయాత్ర’ పేరుతో చిత్రించిన ఎంఎఫ్ హుస్సేన్ ఈ నెల 19న న్యూయార్క్‌లోని క్రిస్టీలో వేలం అమృతా షేర్‌గిల్ చిత్రం ‘ది స్టోరీ టెల్లర్’ రికార్డు బద

Date : 21 March 2025 10:57 AM Views : 229

Studio18 News - తాజా వార్తలు / : భారత్‌కు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రికార్డుస్థాయి ధర పలికింది. ‘గ్రామయాత్ర’ పేరుతో గీసిన చిత్రం వేలంలో ఏకంగా రూ. 118 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో భారతీయ చిత్ర కళలో ఇది అత్యంత ఖరీదైన కళాఖండంగా రికార్డులకెక్కింది. హుస్సేన్ ఈ చిత్రాన్ని 1950లలో గీశారు. న్యూయార్క్‌లోని క్రిస్టీలో ఈ నెల 19న ఈ వేలం నిర్వహించగా రికార్డుస్థాయి ధర పలికింది. ప్రసిద్ధ చిత్రకారిణి అమృతా షేర్‌గిల్ 1937లో గీసిన ‘ది స్టోరీ టెల్లర్’ చిత్రానికి 2023లో ముంబైలో నిర్వహించిన వేలంలో రూ. 61.8 కోట్ల ధర పలికింది. ఇప్పుడు హుస్సేన్ చిత్రం ఆ రికార్డును బద్దలుగొట్టి దేశ చిత్ర కళలో అత్యంత ఖరీదైన కళాఖండంగా నిలిచింది. 14 అడుగుల కాన్వాస్ కలిగి ఉన్న హుస్సేన్ ‘గ్రామయాత్ర’ చిత్రం.. అప్పటికి కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారతదేశంలోని గ్రామీణ జనజీవన వైవిధ్యాన్ని తెలియజేస్తోంది. ఈ చిత్రాన్ని 1954లో నార్వేకు చెందిన డాక్టర్ లియాన్ ఎలియాస్ వొలొదార్ స్కీ కొనుగోలు చేసి 1964లో ఓస్లో యూనివర్సిటీ ఆసుపత్రికి అందించారు. ఇప్పుడీ చిత్రాన్ని అమ్మగా వచ్చిన మొత్తాన్ని యూనివర్సిటీ వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :