Tuesday, 10 March 2026 03:49:25 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణికి బిగ్ షాక్ .. క్వార్ట్జ్ అక్రమ క్వారీయింగ్‌ కేసులో 4వ నిందితుడుగా చేర్పు

కాకాణి గోవర్థన్ రెడ్డిపై కేసు నమోదు క్వార్డ్జ్ అక్రమ క్వారీయింగ్ కేసులో ఏ 4గా కాకాణి పేరు కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

Date : 25 March 2025 11:15 AM Views : 510

Studio18 News - తాజా వార్తలు / : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీస్తూ కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో జరిగిన అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలకు సంబంధించిన కేసులో కాకాణిని ఏ4గా చేర్చినట్లు సమాచారం. రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి గతంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మూడు రోజుల పాటు క్వారీ వద్ద సత్యాగ్రహ దీక్ష చేశారు. మైనింగ్ లోడ్లతో రవాణాకు సిద్ధమైన 40 లారీలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ అక్రమ మైనింగ్ వెనుక అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్‌పై చర్యలు లేకపోవడంతో కేంద్ర మైనింగ్ శాఖకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కేంద్రం ఆదేశాలతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ అక్రమ క్వారీయింగ్ కేసులో కదలిక మొదలైంది. తొలుత ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరులైన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డిలపై కేసు నమోదు చేయగా, వీరు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. తాజాగా సోమవారం ఈ కేసులో కాకాణితో సహా మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఏ6, ఏ8గా ఉన్న ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిని గూడూరు కోర్టులో హాజరుపరిచి న్యాయస్థానం ఆదేశాలతో జైలుకు తరలించారు. ఒకవైపు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగంట శ్రీనివాసులు రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో ప్రభుత్వం సిట్‌ను నియమించడం, మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా చేర్చడంతో కాకాణి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని భావిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :