Monday, 16 March 2026 01:54:52 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

ప్రపంచంలో టాప్-10 అత్యంత అవినీతి దేశాలు ఇవే.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే?

Most Corrupt Countries 2025: అవినీతి.. ఇది లేకుండా ప్రభుత్వంలోని ఒక్క శాఖ కూడా పనిచేయదు. చిన్న పని చేయడానికైనా అధికారులకు లంచం ఇవ్వాల్సిందే.. ఇది మన ఒ

Date : 11 December 2025 08:27 PM Views : 104

Studio18 News - తాజా వార్తలు / : అవినీతి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశం ఏదో ఒక రూపంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య, ఇది ఆర్థిక వ్యవస్థలను, ప్రజా వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తూ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ తాజాగా 2025లో ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో దక్షి సుడాన్ ఉండగా.. 10వ స్థానంలో ఉత్తర కోరియా ఉంది. వివిధ దేశాల్లోని నిపుణులు, వ్యాపారుల అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉన్నదో అంచనా వేసి ఈ సంస్ధ వాటికి స్కోర్‌ను ఇస్తుంది. ఈ సంస్థ మొత్తం 180 దేశాల లిస్టు సిద్ధం చేయగా.. అందులో అత్యంత అవినీతికి పాల్పడిన దేశాలకు సున్నా స్కోరు, అవినీతి లేని దేశాలకు 100 స్కోరు కేటాయిస్తుంది. ఈ జాబితా యుద్ధాలు, రాజకీయ అస్థిరత, బలహీన సంస్థల వల్ల ప్రభావితమైన దేశాలను ప్రతిబింబిస్తుంది. 2024లో ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశంగా దక్షిణ సూడాన్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా. 9 పాయింట్లతో సోమాలియా రెండో స్థానంలో, వెనిజులా, 10 సిరియా 12 పాయింట్లతో మూడు, నాగులు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ రిపోర్ట్ ప్రకారం భారత దేశం 180 దేశాల్లో 38 స్కోర్‌తో 96 స్థానంలో కొనసాగుతుంది. అయితే గత నివేదికలతో పోలిస్తే భారత్ స్కోరు కొద్దిగా తగ్గింది. 2023 నివేదికలో భారత్ 38 పాయింట్లు, 2022లో 40 పాయింట్లలో కొనసాగగా.. 2024 రిపోర్టులో భారత్ స్కోరు 38గా నమోదైంది. అయితే గతంలో పోల్చితే 2024లో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అవినీతి స్థాయిలు “చాలా ఎక్కువగా” ఉన్నాయని, కొన్ని దేశాల్లో మాత్రమే పురోగతి కనిపించిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ పేర్కొంది. 2012 తర్వాత దాదాపు 32 దేశాలు చాలా వరకు మార్పు వచ్చినప్పటికీ.. మిగతా148 దేశాల్లో మాత్రం ఎలాంటి మార్పు కనబడలేదని ఈ సంస్థ పేర్కొంది. 2025లో టాప్ -10 అవినీతి దేశాల జాబితా 1 సౌత్ సుడాన్ 2 .సోమాలియా 3. వెనెజువెలా 4. సిరియా 5. యెమెన్ 6. లిబియా 7 .ఎరిట్రియా 8. ఈక్వటోరియల్ గినియా 9. సుడాన్ 10. ఉత్తర కొరియా

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :