Tuesday, 10 March 2026 03:47:44 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...!

Date : 17 March 2025 04:38 PM Views : 275

Studio18 News - తాజా వార్తలు / : కోతి చేష్టలు అని పెద్దలు ఊరికే అనలేదు. కోతులు చేసే పనులు జనాలను ఎంత ఇబ్బందులకు గురి చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చేతిలోని వస్తువులను లాక్కెళ్లడం, పైగా పళ్లు బయటపెట్టి బెదిరించడం వంటి వంటి చర్యలతో కోతులు అంటేనే ప్రజలు హడలిపోతుంటారు. తాజాగా కోతి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ లో జరిగిందీ ఘటన. ఓ వ్యక్తికి చెందిన శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ను లాగేసుకున్న కోతి గోడెక్కి కూర్చుంది. ఈ ఫోన్ ధర రూ.1.50 లక్షల వరకు ఉంటుంది. అయితే, ఆ ఫోన్ సొంతదారుడు ఎంతో తెలివిగా ఆలోచించి, తన ఫోన్ ను తిరిగి దక్కించుకున్నాడు. కొన్ని మ్యాంగో డ్రింక్ ప్యాకెట్లను కొనుగోలు చేసిన ఆ వ్యక్తి... ఒక ప్యాకెట్ ను కోతి ఉన్న దిశగా విసిరాడు... అయితే ఆ ప్యాకెట్ కోతికి దూరంగా పడింది. మరో ప్యాకెట్ కరెక్టుగా కోతి చేతుల్లో పడింది. దాంతో కోతి ఆ మ్యాంగో డ్రింక్ ప్యాకెట్ తీసుకుని, ఫోన్ ను కిందికి జారవిడించింది. ఆ వ్యక్తి తన ఫోన్ ను అందుకుని అక్కడ్నించి నిష్క్రమించాడు. ఈ ఘటన హోలీ రోజున జరిగినట్టు తెలుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :