Tuesday, 10 March 2026 03:44:48 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

MMTS రైల్లో యువతిపై అత్యాచారయత్నం ఘటన.. నిందితుడిని గుర్తించిన పోలీసులు

ఎంఎంటీఎస్ రైలు బోగీలో యువతిపై అత్యాచారయత్నంకు సంబంధించిన కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించారు.

Date : 25 March 2025 11:55 AM Views : 519

Studio18 News - తాజా వార్తలు / : MMTS Train Incident: ఎంఎంటీఎస్ రైలు బోగీలో యువతిపై అత్యాచారయత్నంకు సంబంధించిన కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించారు. పాత నేరస్తుడు జంగం మహేశ్ పై అనుమానంతో అతడి ఫొటోను పోలీసులు బాధితురాలికి చూపించారు. రైలులో తనపై దాడిచేసింది ఫొటోలోని వ్యక్తేనని బాధితురాలు పేర్కొంది. జంగం మహేశ్ మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసుగు గుర్తించారు. ఏడాది క్రితమే మహేశ్ ను అతని భార్య వదిలేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒంటిరిగా ఉంటున్నాడు. మహేశ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. యువతిపై అత్యాచారయత్నంకు ప్రయత్నించడంతో ఆమె తప్పించుకోవడానికి రైలులో నుండి కిందకు దూకింది. తీవ్రగాయాలతో గుడ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ సమీంలో పడిఉన్న యువతిని చూసిన పాదారుడు.. 108కు సమాచారం ఇచ్చాడు. దీంతో యువతిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన యువతిగా గుర్తించారు. యువతి మేడ్చల్ వర్కింగ్ విమెన్స్ హాస్టల్ లో ఉంటూ స్విగ్గిలో పనిచేస్తుంది. సికింద్రాబాద్ లో తన సెల్ ఫోన్ రిపేర్ చేయించుకొని ఎంఎంటీఎస్ రైలులో తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళల కోచ్ లో యువతి ఎక్కింది. ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్ లో దిగిపోయారు. బోగీలో యువతి ఒక్కతే ఉండగా ఓ యువకుడు ఆమెపై అత్యాచారయత్నంకు పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రైలు నుంచి దూకింది. ప్రస్తుతం యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితుడిగా భావించి జంగం మహేశ్ ఫొటోను యువతికి చూపించగా.. అతడే నిందితుడని తేలింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :