Monday, 16 March 2026 01:54:50 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

Krishna River Water Dispute: ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంచాయితీల కోసం ప్రత్యేక కమిటీ

Date : 02 January 2026 06:31 PM Views : 60

Studio18 News - తాజా వార్తలు / : ఏపీ, తెలంగాణ మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కమిటీ సీడబ్ల్యూసీ ఛైర్మన్ నేతృత్వంలో పనిచేయనున్న నిపుణుల బృందం గతేడాది జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 గడువును పొడిగించిన కేంద్రం పెండింగ్ ప్రాజెక్టులు, నీటి పంపిణీపై కమిటీ సమగ్ర అధ్యయనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య దశాబ్దకాలంగా కొనసాగుతున్న కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఓ ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) ఛైర్మన్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ) ఛైర్మన్లు, జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) చీఫ్ ఇంజినీర్‌తో పాటు ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. గతేడాది జులైలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని చర్చించారు. ఇటీవల డిసెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం తమ ప్రతినిధులను నామినేట్ చేయడంతో కమిటీ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ఇరు రాష్ట్రాల మధ్య నీటిని సమానంగా పంచడం, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనలు వంటి కీలక అంశాలపై ఈ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి, పరిష్కార మార్గాలను సూచిస్తుంది. ఇదే సమయంలో, కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ-2) గడువును కూడా కేంద్రం 2026 జులై వరకు పొడిగించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :