Monday, 16 March 2026 01:53:17 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

Rajendra Prasad: వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు.. వీడియో వైర‌ల్‌!

నితిన్‌, వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో 'రాబిన్‌హుడ్' ఈ నెల 28న విడుద‌ల కానున్న సినిమా జోరుగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న మేక‌ర్స్‌ నిన్న హైద‌రాబాద్ ప్రీ ర

Date : 24 March 2025 12:15 PM Views : 236

Studio18 News - తాజా వార్తలు / : టాలీవుడ్ యువ హీరో నితిన్‌, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం 'రాబిన్‌హుడ్'. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ సినిమాలో నితిన్ స‌ర‌స‌న హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీల నటించింది. ఈ నెల 28న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో మేక‌ర్స్ ముమ్మ‌రంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌కు ఆసీస్ క్రికెట‌ర్ డేవిడ్‌ వార్నర్ ప్ర‌త్యేక‌ అతిథిగా విచ్చేసి సందడి చేశాడు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వార్న‌ర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. వేదిక‌పై రాజేంద్ర ప్ర‌సాద్‌ మాట్లాడుతూ... "హీరో నితిన్‌, ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల క‌లిసి ఈ వార్నర్ ను పట్టుకొచ్చారు. అతడ్ని క్రికెట్ ఆడమంటే.. పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు. ఈ దొంగ ము** కొడుకు.. వీడు మాములోడు కాదండి. రేయ్ వార్నర్. నీకు ఇదే నా వార్నింగ్" అని అన్నారు. అయితే, రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు అర్థం కాక, వార్నర్ నవ్వుతూ కనిపించాడు. రాజేంద్ర ప్ర‌సాద్ స‌ర‌దాగానే ఈ కామెంట్స్ చేసినా ఇలా మాట్లాడ‌ట‌మేంట‌ని వార్న‌ర్ అభిమానులు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఈవెంట్ లో వార్న‌ర్ డ్యాన్స్ చేయ‌డంతో పాటు తెలుగులో మాట్లాడి అంద‌రినీ న‌వ్వించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :