Studio18 News - తాజా వార్తలు / : టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో సందడి చేశాడు. అతడు ఓ అమ్మాయితో కలిసి మ్యాచ్‌ను వీక్షించాడు. తన భార్య ధన శ్రీ వర్మతో చాహల్ విడాకులు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్న క్రమంలో.. అతడితో ఉన్న మిస్టరీ గర్ ఎవరు? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆమె మరెవరో కాదు ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆర్జే మహ్వాష్. కాగా.. మ్యాచ్ సమయంలో ఆమె ఓ స్పెలీ వీడియో, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చాహల్ కలిసి నవ్వుతూ ఆ వీడియోలో కనిపించింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Admin
Studio18 News