Tuesday, 10 March 2026 03:44:18 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల విచారణ అనంతరం యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్యలు

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ శ్యామల సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.

Date : 24 March 2025 03:40 PM Views : 433

Studio18 News - తాజా వార్తలు / : Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. పోలీసులు ఆమెను మూడు గంటల పాటు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం శ్యామల మీడియాతో మాట్లాడారు.

శ్యామల మాట్లాడుతూ.. ‘‘పోలీసుల విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా చనిపోయిన వారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. బెట్టింగ్ యాప్స్ ద్వారా బెట్టింగులు చేయడం తప్పు అని అన్నారు. బెట్టింగ్ యాప్స్ అంశంపై విచారణ జరుగుతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. అందుకే దానిపై స్పందించలేను. నాకు చట్టాలపై నమ్మకం ఉంది. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయబోను’’ అంటూ శ్యామల చెప్పారు.

బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మందిపై కేసు నమోదైంది. వీరిలో టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించారు. అయితే, విష్ణుప్రియ, రీతూచౌదరి ఈనెల 25న మళ్లీ విచారణకు రావాలని పోలీసులు సూచించారు. యాంకర్ శ్యామల తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని శ్యామలకు కోర్టు సూచించింది. దీంతో ఆమె పంజాగుట్ట పోలీసుల ఎదుట సోమవారం విచారణకు హాజరయ్యారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :