Tuesday, 10 March 2026 03:50:42 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Air India: ఎయిరిండియాలో విమానంలో ప్ర‌యాణికుడి మృతి!

ఢిల్లీ నుంచి ల‌క్నో వెళ్లిన‌ ఎయిరిండియా విమానంలో ఘ‌ట‌న‌ మృతుడిని ఢిల్లీకి చెందిన ఆసిఫ్ ఉల్హా అన్సారీగా గుర్తింపు ఆసిఫ్ మృతికి గ‌ల కార‌ణాలు తెలియని వైన

Date : 21 March 2025 12:48 PM Views : 244

Studio18 News - తాజా వార్తలు / : దేశ రాజ‌ధాని ఢిల్లీ నుంచి ల‌క్నో వెళుతున్న ఎయిరిండియా విమానం గాల్లో ఉండ‌గానే ఓ ప్ర‌యాణికుడు అనారోగ్యంతో మృతిచెందాడు. ఢిల్లీ నుంచి బ‌య‌ల్దేరిన విమానం ల‌క్నో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ఈరోజు ఉద‌యం 8.10 గంట‌ల‌కు ల్యాండ్ అయింది. ప్ర‌యాణికులు అంద‌రూ దిగుతుండ‌గా... ఓ వ్య‌క్తి మాత్రం ఉలుకుపలుకూ లేకుండా సీటులోనే కూర్చొని ఉండ‌టాన్ని క్లీనింగ్ సిబ్బంది గుర్తించింది. వెంట‌నే విమానంలో ఉన్న ఓ వైద్యుడు ఆ వ్య‌క్తిని ప‌రీక్షించి మృతి చెందిన‌ట్లు ధృవీక‌రించారు. దాంతో సిబ్బంది వెంటనే అధికారుల‌కు స‌మాచారం అందించారు. మృతుడిని ఢిల్లీకి చెందిన ఆసిఫ్ ఉల్హా అన్సారీగా అధికారులు గుర్తించారు. విమానం ఎక్కిన త‌ర్వాత అత‌డికి ఇచ్చిన ఆహార ప‌దార్థాలు అలాగే ఉండ‌డం, సీటు బెల్టు కూడా తీయ‌క‌పోవ‌డంతో ఫ్లైట్ గాల్లో ఉండ‌గానే ఆసిఫ్ చ‌నిపోయి ఉంటాడ‌ని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించిన అధికారులు... అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు కూడా స‌మాచారం అందించిన‌ట్లు తెలిపారు. ఆసిఫ్ మృతికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :