Tuesday, 10 March 2026 03:50:43 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే..

మిగతా వారికి నిధులు సమీప భవిష్యత్తులో జమ అవుతాయి.

Date : 26 March 2025 12:39 PM Views : 638

Studio18 News - తాజా వార్తలు / : తెలంగాణలో అన్నదాతలకు అందిస్తున్న రైతు భరోసా పథకం కింద సర్కారు డబ్బులు జమచేసింది. నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న 1.06 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. మొత్తం రూ.199.99 కోట్లను అధికారులు జమ చేశారు. 3.33 లక్షల ఎకరాల భూమికి సంబంధించిన నిధులు ఇవి. తెలంగాణలోని సుమారు 71 శాతం మంది అన్నదాతలకు రైతు భరోసా సాయం అందింది. ఈ పథకం అమలును షురూ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 77.78 లక్షల ఎకరాలకు 54.74 లక్షల మంది రైతులకు డబ్బులు అందాయి.

వారి అందరి ఖాతాల్లో కలిపి మొత్తం రూ.4,666.60 కోట్లు వేశారు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో సీజన్‌‌కు రూ.6 వేల చొప్పున డబ్బులు ఇస్తున్న విషయం తెలిసిందే. రెండు సీజన్లు కలిపి ఎకరాకు రూ.12 వేలు చొప్పున అన్నదాతలకు డబ్బులు వేస్తారు. ఈ నెల చివరిలోగా.. ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న అన్నదాతల ఖాతాల్లో డబ్బులు వేస్తారు. తెలంగాణలో 77 లక్షల మంది రైతు భరోసా పొందేందుకు అర్హులు. 54.74 లక్షల మందికి పెట్టుబడి సాయం అందింది. మిగతా వారికి నిధులు సమీప భవిష్యత్తులో జమ అవుతాయి. ఈ పథకం కింద ఇప్పటివరకు గరిష్ఠంగా నల్లగొండ జిల్లాకు రూ.335.50 కోట్లు విడుదల అయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో సంగారెడ్డికి (రూ.230.06 కోట్లు) ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :