Tuesday, 10 March 2026 03:45:34 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

రోడ్డు రోడ్డుకో ‘ఆధార్ నెంబర్..‘ జీహెచ్ఎంసీ ఖతర్నాక్ ప్లాన్.. ఇక..

జీహెచ్ఎంసీ త్వరలో అధునాతన టెక్నాలజీతోకూడిన ఆబ్లిక్ కెమెరాలను అందుబాటులోకి తేనుంది.

Date : 22 March 2025 03:26 PM Views : 312

Studio18 News - తాజా వార్తలు / : GHMC: జీహెచ్ఎంసీలో రోడ్ల మరమ్మతుల పేరిట ప్రతీయేటా వందల కోట్లు ఖర్చవుతున్నాయి. అయితే, కొందరు కాంట్రాక్టర్లు వేసిన రోడ్డునే వేయడం, రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లేకపోవటం.. నామమాత్రంగా రోడ్డుపై లేయర్ వేసి బిల్లులు ఎత్తుకోవటం వంటివి చేస్తున్నారు. వీరికి కొందరు అధికారులు సహకరిస్తూ జేబులు నింపుకుంటున్నారు. తద్వారా జీహెచ్ఎంసీ నిధులు దుబారా అవుతున్నాయి. భవిష్యత్ లో నాణ్యతలేని పనులకు, నిధుల దుబారాకు అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్ఎంసీ అధునాతన సాంకేతికత వినియోగించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆబ్లిక్ కెమెరాలను అమర్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో మొత్తం 9013.01 కిలోమీటర్ల మేర రోడ్లున్నాయి. వీటిలో సీసీ రోడ్లు 6166.55 కిలో మీటర్లు, బీటీ రోడ్లు 2846.46 కిలో మీటర్ల మేర ఉన్నాయి. వాటిలో ఏ రోడ్డును ఎప్పుడు వేశారో, రోడ్డుపైన ఎన్ని పొరలుగా బీటీలు వేశారో తెలియదు. ఎన్నిసార్లు పాట్ హోల్స్ పూడ్చివేత పేరిట జీహెచ్ఎంసీ ఖజానాకు చిల్లులు పెట్టారో తెలియదు. రాబోయే కాలంలో ఈ పరిస్థితి మారనుంది. అధునాతన టెక్నాలజీతో ప్రతిరోడ్డుకు ఒక ఐడీ నెంబర్ రానుంది. అంతేకాదు.. ఇకపై ఆ రోడ్డు పేరిట జరిగే పనులన్నీ ఆన్ లైన్ లో నమోదు కానున్నాయి. ఈ ఐడీ నెంబర్ ను ఎంటర్ చేస్తే ఆ రోడ్డు చరిత్ర మొత్తం తెలుస్తోంది. ఆబ్లిక్ కెమెరాలతో రోడ్డు దిగువన ఏముందో కూడా తెలుస్తోంది. ఈ కెమెరాలు వివిధ ప్రాంతాల నుంచి ఏటవాలు కోణాల్లోంచి (దాదాపు 40-45 డిగ్రీల) ఫొటోలు తీస్తాయి. దీంతో రోడ్లు ఎన్ని పొరలుగా, ఎంత పైకి పెరిగాయో తెలుసుకునే వీలుంటుంది. మొత్తం ఎన్ని పొరలు వేశారో తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి ఏటవాలుగా తీసే చిత్రాలతో భూమి లోతున ఎంత అడుగు వరకు రోడ్డేశారన్నది తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఆబ్లిక్ కెమెరాల వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. వరదలు వంటివి వచ్చినప్పుడు రోడ్డు ఎంత మేరదెబ్బతింది. ఏర్పడ్డ పగుళ్లు, పాట్ హోల్స్ వంటివి స్పష్టంగా తెలుస్తాయి. నిర్మాణ పరంగా లోపాలున్నా వెల్లడవుతాయి. దాంతో అడ్డగోలుగా మరమ్మతుల వ్యయం పెంచకుండా ఉండటమే కాక జరిగిన పనుల నాణ్యతసైతం తెలుస్తుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :