Tuesday, 10 March 2026 03:50:22 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Konda Surekha: చంద్రబాబునాయుడుకు కొండా సురేఖ లేఖ

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు అంశంపై లేఖ రాసిన మంత్రి సిఫార్సు లేఖలను అనుమతించాలని తీసుకున్న నిర్ణయంపై హర్షం టీటీడీ అధికారులు మీ ఆదేశాలను పట్టించుక

Date : 12 March 2025 11:22 AM Views : 204

Studio18 News - తాజా వార్తలు / : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల అమలు అంశంపై ఆమె ఈ లేఖ రాశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల అమలుపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోరారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సిఫార్సు లేఖలను అనుమతించాలని ఇటీల మీరు తీసుకున్న నిర్ణయం సంతోషాన్ని కలిగించిందని కొండా సురేఖ పేర్కొన్నారు. సిఫార్సు లేఖలపై సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కానీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదని, మీ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని మంత్రి తెలిపారు. శ్రీవారిని దర్శించుకోవడానికి తెలంగాణ నుండి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ విషయంలో టీటీడీకి వెంటనే సూచనలు ఇవ్వాలని ఆమె కోరారు. సిఫార్సు లేఖల విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :