Tuesday, 10 March 2026 03:49:03 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

DC vs LSG : ల‌క్నో పై ఢిల్లీ సంచ‌ల‌న విజ‌యం.. కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ కామెంట్స్‌.. ‘నా కెప్టెన్సీలో..’

ల‌క్నో పై సంచ‌ల‌న విజ‌యం సాధించిన త‌రువాత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

Date : 25 March 2025 10:22 AM Views : 578

Studio18 News - తాజా వార్తలు / : ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ శుభారంభం చేసింది. విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. 210 ప‌రుగుల భారీ లక్ష్య ఛేద‌న‌లో ఓ ద‌శ‌లో 7 ఓవ‌ర్ల‌లో 66 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డిన ఢిల్లీ జ‌ట్టు అసామాన్య ఆట తీరును ప్ర‌ద‌ర్శించింది. అశుతోష్ శ‌ర్మ (66 నాటౌట్; 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), విప్ర‌జ్ నిగ‌మ్ (39; 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (34; 22 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స‌ర్లు) సంచ‌ల‌న బ్యాటింగ్‌తో ఢిల్లీ జ‌ట్టు 19.3 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి మ‌రుపురాని విజ‌యాన్ని అందుకుంది. కాగా.. ఈ అద్భుత విజ‌యం పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ స్పందించాడు.

ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం చాలా బాగుంద‌న్నాడు. తాను తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు హెచ్చుత‌గ్గుల‌తో కూడి ఉంటాయ‌ని, వాటికి అల‌వాటు ప‌డాల‌ని ఫ్యాన్స్‌కు సూచించాడు. ఇప్పుడు మ్యాచ్ గెలిచాం కాబ‌ట్టి ఎవ్వ‌రూ ఏమీ అన‌రు అని అన్నాడు. ముఖ్యంగా స్ట‌బ్స్‌కు బౌలింగ్ ఎందుకు ఇచ్చావ‌ని అడుగ‌ర‌ని అన్నాడు. ఇలాంటి మ్యాచ్‌ను తాను ఎప్పుడు చూశానో త‌న‌కు గుర్తు లేద‌న్నాడు. ప‌వర్ ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయిన త‌రువాత మ్యాచ్ గెల‌వ‌డం ఓ అద్భుతం అన్నాడు. ప్ర‌స్తుతం క్రికెట్‌లో చాలా మార్పులు జ‌రుగుతున్నాయి. ఒక్క‌రు క్రీజులో ఉన్నా చాలు.. ఓ బౌల‌ర్‌గా ఇదంతా మైండ్ గేమ్ అని భావిస్తున్న‌ట్లు చెప్పాడు.

ఇక ల‌క్నో బ్యాటింగ్ తీరు ఆరంభ‌మైన తీరు గ‌మ‌నిస్తే.. మేము ప‌వ‌ర్ ప్లేలో చాలా ఎక్కువ ప‌రుగులు ఇచ్చాము. అయితే.. ఆఖ‌రి ఏడు ఓవ‌ర్ల‌లో వారిని క‌ట్ట‌డి చేశాము. వారి ప్రారంభం చూస్తే 240కి పైగా ప‌రుగులు చేస్తార‌ని అనిపించింది. అయితే.. మేము 210లోపే క‌ట్ట‌డి చేయ‌గ‌లిగాము. ఒత్తిడిలో కూడా ఎంతో చ‌క్క‌గా విప్ర‌జ్ నిగ‌మ్ ఆడాడు. ఈ క్రెడిట్ అత‌డికే ద‌క్కుతుంది. అత‌డి సామ‌ర్థ్యం ఏంటో మాకు తెలుసు అని అక్ష‌ర్ ప‌టేల్ అన్నాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :