Tuesday, 10 March 2026 03:49:02 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

ఇటుకలు, చెక్క ముక్కలను బంగారంగా మారుస్తున్నారు! ఎక్కడంటే..?

బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు నకిలీ బంగారం అమ్ముతూ మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటుకలు, చెక్క ముక్కలకు బంగారం పూత పూసి అమ్మ

Date : 24 March 2025 04:27 PM Views : 510

Studio18 News - తాజా వార్తలు / : బంగారం.. పేరు వింటేనే మహిళల కళ్లలో మెరుపులు మెరుస్తాయి. ప్రస్తుతం ఉన్న ధర చూసి భయపడుతున్నారు కానీ, తక్కువ రేటుకు వస్తుందంటే.. అప్పు చేసి అయినా కొనేస్తారు. ప్రజల్లో ఉండే ఈ ఆశనే కొంతమంది క్యాష్‌ చేసుకోవాలని అనుకున్నారు. అందుకోసం ఇటుకలు, చెక్కముక్కలను బంగారంగా మార్చి అమ్మే ప్రయత్నం చేశారు. కానీ, అసలు విషయం కనిపెట్టిన పోలీసులు వాళ్లను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రబీకుల్ ఇస్లాం, అలీ, అన్వర్ హుస్సేన్‌ అనే ముగ్గురు వ్యక్తులు బెంగళూరులోని కోరమంగళలో ప్రాంతంలో సంచరిస్తూ.. తమ వద్ద బంగారం ఉందని, ఇంటి పునాది వేస్తున్నప్పుడు బంగారు నిధి దొరికిందని ఒక కథను అల్లారు. అలాగే. మార్కెట్లో బంగారం ధరలో సగం ధరకే బంగారం ఇస్తామని అన్నారు. దీంతో వారి నుంచి బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ప్రజలు ఆసక్తి చూపించారు. అయితే నిందితులు చెక్క పలకలు, ఇటుకలకు గోల్డ్‌ కోటింగ్‌ చేసి ఈ మోసానికి తెరలేపారు. నిందితులు మొదట్లో రెండు గ్రాముల నిజమైన బంగారాన్ని ఇచ్చారు, తాము ఇస్తున్నది నిజమైన బంగారమే అని ప్రజలను నమ్మించారు. ఆ తర్వాత నకిలీ బంగారాన్ని అమ్మడానికి ప్రయత్నించారు. బంగారాన్ని తీసుకోవడానికి వారు పేర్కొన్న ప్రదేశానికి రమ్మని ప్రజలకు చెప్పేవారు. దీని గురించి సీసీబీ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారిని కోరమంగళలో అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వ్యక్తుల నుండి 970 గ్రాముల నకిలీ బంగారం, ఒక వాహనం, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :