Monday, 16 March 2026 01:53:17 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం

మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ వ్యవహారంలో విచారణ జరుపుతున్న సీబీఐ రాయ్ పూర్, భిలాయ్ లోని భూపేశ్ భాఘెల్ నివాసాల్లో తనిఖీలు కాంగ్రెస్ పార్టీ నేతలు మరికొంద

Date : 26 March 2025 12:15 PM Views : 603

Studio18 News - తాజా వార్తలు / : ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేశ్ బాఘెల్ నివాసంలో బుధవారం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. రాయ్ పూర్, భిలాయ్ లలోని బాఘెల్ నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. బుధవారం ఉదయం సీబీఐ అధికారులు బాఘెల్ ఇంటికి చేరుకున్నారని, ఆయన నివాసాలతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతల ఇళ్లపైనా రెయిడ్ చేశారని బాఘెల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సోదాలకు సంబంధించి అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ విచారణలో భాగంగానే ఈ దాడులు జరిగినట్లు సమాచారం. బాఘెల్ ఈ రోజు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా సీబీఐ సోదాలు జరగడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారని బాఘెల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, సీబీఐ దాడులపై కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్ గఢ్ నేత సుశీల్ ఆనంద్ శుక్లా స్పందిస్తూ.. భూపేశ్ బాఘెల్ ను చూసి బీజేపీ భయపడుతోందని అన్నారు. కాంగ్రెస్ పంజాబ్ ఇన్ ఛార్జిగా బాఘెల్ నియామకం జరిగిన తర్వాత బీజేపీ పెద్దలకు భయం మొదలైందన్నారు. బాఘెల్ ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక విచారణ సంస్థలతో దాడులు చేయిస్తూ నిలువరించే ప్రయత్నం చేస్తోందన్నారు. తొలుత ఈడీ అధికారులను పంపిన కేంద్రం.. తాజాగా సీబీఐ అధికారులను బాఘెల్ నివాసానికి పంపిందన్నారు. అయితే, ఈ దాడులకు బాఘెల్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ భయపడబోదని శుక్లా స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :