Monday, 16 March 2026 01:53:18 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

10th Paper Leak: పేపర్ లీక్ లో నా తప్పేమీ లేదు.. కన్నీటి పర్యంతమవుతున్న విద్యార్థిని

నల్గొండ జిల్లాలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కలకలం రాయితో కొడతానని బెదిరించి పేపర్ చూపించమన్నారని విద్యార్థిని వెల్లడి విద్యార్థిని డిబార్, అధికారులపై

Date : 24 March 2025 12:06 PM Views : 312

Studio18 News - తాజా వార్తలు / : నల్గొండ జిల్లా నకిరేకల్ లో పదో తరగతి పరీక్ష పత్రం లీక్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఓ విద్యార్థినిని డిబార్ చేసిన అధికారులు.. ఆ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ ను విధుల నుంచి తప్పించారు. అయితే, పేపర్ లీక్ ఘటనలో తన తప్పేమీలేదని బాధిత విద్యార్థిని వాపోయింది. పరీక్షా కేంద్రంలో కిటికీ పక్కన కూర్చుని సమాధానాలు రాస్తుండగా ఇద్దరు యువకులు తనను బెదిరించారని ఆరోపించింది. ప్రశ్నాపత్రం చూపించకపోతే రాయితో కొడతామనడంతో తాను భయపడ్డానని, ఏంచేయాలో తోచక పేపర్ చూపించానని చెప్పింది. పేపర్ ను ఫొటో తీసుకుని యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారని వివరించింది. ఆ యువకులు ఎవరో కూడా తనకు తెలియదని, ఇందులో తన తప్పేమీ లేదని తెలిపింది. పరీక్ష రాయడానికి తనను అనుమతించాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. కాగా, శుక్రవారం నకిరేకల్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్షాకేంద్రంలో ప్రశ్నాపత్రం లీక్ అయింది. గోడ దూకి పరీక్షాకేంద్రంలోకి ప్రవేశించిన కొంతమంది వ్యక్తులు ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసుకుని వెళ్లారు. ఆపై జవాబులు వెతికి, జిరాక్స్ తీయించి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అందించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. దీనిపై ఎంఈవో ఫిర్యాదు చేయగా.. పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేసి, ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :