Tuesday, 10 March 2026 03:49:07 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Vamsikrishna Jogada: ‘మ్యాట్రిమోనీ’ మోసగాడు.. పెళ్లి పేరుతో మహిళలకు వల.. ఆపై డబ్బులు దండుకుని పరార్!

రెండో పెళ్లి కోసం వెతుకున్న మహిళలను మోసం చేస్తున్న ప్రబుద్ధుడు మ్యాట్రిమోనీ సైట్‌లలో తప్పుడు సమాచారంతో యువతులకు వల జూబ్లీహిల్స్ మహిళా వైద్యురాలి ఫిర్య

Date : 19 March 2025 11:31 AM Views : 220

Studio18 News - తాజా వార్తలు / : నేను ఎన్నారై, అమెరికాలో అమ్మ పెద్ద డాక్టర్.. ఆమె ఇండియాకు రాగానే పెళ్లి చేసుకుందాం అంటూ మ్యాట్రిమోనీ తరహా వెబ్‌సైట్లలో తప్పుడు సమాచారంతో అమ్మాయిలను మోసం చేసి వారి నుంచి డబ్బులు దండుకునే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్‌ హర్ష చెరుకూరి బీటెక్ చదవడానికి 2014లో హైదరాబాద్‌కు చేరుకున్నాడు. బీటెక్ మధ్యలోనే ఆపేసి 2015లో ఆన్‌లైన్‌ గేమింగ్, బెట్టింగ్‌ వంటి జూదాలకు అలవాటుపడ్డాడు. అంతే కాకుండా జాబ్ కన్సల్టెన్సీ పేరుతో కొంత మందిని మోసం చేసిన కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆ తరువాత సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి తన ఆదాయంలో ఎక్కువగా సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేశాడు. అలా దాదాపు వెయ్యి మంది నుంచి డబ్బు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా యానాంకు చెందిన ఓ ఎమ్మెల్యే ఫొటోను తన సోషల్ మీడియాలో డీపీగా పెట్టుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 50 మంది నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేశాడు. ఈ కేసుల్లో పలు మార్లు అరెస్టు అయి జైలుకు వెళ్లివచ్చినా ఇతనిలో ఎటువంటి మార్పు రాలేదు. ఆ తర్వాత మోసాలకు పెళ్లి సంబంధాలను ఎంచుకున్నాడు. మ్యాట్రిమోనీ తరహా వెబ్‌సైట్‌లలో తప్పుడు సమాచారం పెట్టి.. రెండో పెళ్లి కోసం చూస్తున్న వారు, 30 ఏళ్ల వయసు దాటిన వారినే టార్గెట్‌ చేశాడు. వాట్సప్‌ కాల్‌ ద్వారా చాటింగ్, కాల్స్ ద్వారా మంతనాలు చేస్తూ తనమీద అమ్మాయిలకు నమ్మకం కలిగిన తర్వాత తన బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌ అయ్యాయని.. ఐటీ అధికారులు డబ్బు తీసుకెళ్లారని, కుటుంబ సభ్యులు ఆసుపత్రుల్లో ఉన్నారంటూ కట్టు కథలు చెప్పేవాడు. అలా ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల నుంచి 25 లక్షల వరకూ మోసం చేసేవాడు. కొన్నిరోజులకు బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే వారి ఫొటోలు మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో కొందరు తమ పరువు పోతుందని భయంతో మిన్నకుండిపోగా, ఇటీవల అతని వల్ల రూ. 11 లక్షలు మోసపోయిన జూబ్లీహిల్స్‌కు చెందిన ఒక డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని బెంగుళూరులో అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్‌కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాలతో జైలుకు తరలించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :