Tuesday, 10 March 2026 03:44:46 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శ్రవణ్‌ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. వాదనలు ఇలా జరిగాయి..

బ్యూరోక్రాట్లు, హైకోర్టు న్యాయమూర్తులపై జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ కుమార్ నిందితుడిగా ఉన్నారు.

Date : 24 March 2025 04:18 PM Views : 531

Studio18 News - తాజా వార్తలు / : తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడు శ్రవణ్‌ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే, పోలీసుల విచారణకు సహకరించాలని శ్రవణ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణ నిమిత్తం.. అమెరికా నుంచి భారత్‌కు వచ్చే వేళ శ్రవణ్‌ కుమార్‌ను అరెస్టు చేయకుండా ఇవాళ ఇలా రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను ఏప్రిల్ 28 వాయిదా వేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బ్యూరోక్రాట్లు, హైకోర్టు న్యాయమూర్తులపై జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ కుమార్ నిందితుడిగా ఉన్నారు. తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ నిరాకరించడంతో ఆ ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. శ్రవణ్ కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. శ్రవణ్ కుమార్ కి అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని కోరారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :