Monday, 16 March 2026 01:54:07 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

Employee Fraud: ఆరేళ్లుగా ఆఫీసుకే పోలేదు, ఆఫీసర్లూ గుర్తించలేదు.. ఎలా పట్టుబడ్డాడంటే..?

ఠంచనుగా జీతం తీసుకుంటున్నా ఆరేళ్లుగా అతడిని చూడలేదంటున్న సహోద్యోగులు 20 ఏళ్ల పాటు సేవలందించిన ఉద్యోగికి సన్మానం చేయాలని బాస్ నిర్ణయం ఏర్పాట్లు చేస్తుం

Date : 19 March 2025 11:09 AM Views : 266

Studio18 News - తాజా వార్తలు / : ఒకటి రెండు రోజులు ఆఫీసుకు వెళ్లకుంటే బాస్ తో అక్షింతలు తప్పవు.. నెలాఖరున జీతంలోనూ ఆమేరకు కోత పడకా తప్పదు. కానీ స్పెయిన్ లో ఓ ఉద్యోగి ఏకంగా ఆరేళ్ల పాటు ఆఫీసు ముఖమే చూడలేదు. వర్క్ ఫ్రం హోం చేశాడని అనుకునేరు.. అసలు పనే చేయలేదు. అయినా నెలనెలా ఠంచనుగా జీతం మాత్రం అందుకున్నాడు. సంస్థలోని రెండు విభాగాల మధ్య సమన్వయ లోపం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడం ఆ ఉద్యోగికి కలిసి వచ్చింది. ఇరవై ఏళ్లుగా సంస్థలో పనిచేస్తున్నందుకు సదరు ఉద్యోగికి సన్మానం చేసే ఏర్పాట్లు చేస్తుండగా ఈ విషయం బయటపడింది. దీంతో ఆ ఉద్యోగిపై కంపెనీ కోర్టుకెక్కింది. స్పెయిన్ లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. స్పెయిన్ లోని కాడిజ్ మున్సిపల్ వాటర్ కంపెనీలో జోయక్విన్ గార్సియా ప్లాంట్ సూపర్ వైజర్ గా పనిచేశారు. 1990లో ఉద్యోగంలో చేరిన గార్సియా.. 2004 వరకు సక్రమంగా విధులు నిర్వహించాడు. వాటర్ ప్లాంట్ నిర్వహణ విషయంలో రెండు డిపార్ట్ మెంట్ ల మధ్య సమన్వయలోపం తలెత్తింది. పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎవరికి వారు ఎదుటి డిపార్ట్ మెంట్ చూసుకుంటుందిలెమ్మని నిర్వహణను గాలికి వదిలేశారు. ఈ విషయం గమనించిన గార్సియా.. 2004 నుంచి విధులు ఎగ్గొడుతూ వచ్చాడు. డ్యూటీకి వెళ్లకపోయినా ఎవరూ గుర్తించకపోవడంతో గార్సియా జీతం నెలనెలా అతడి బ్యాంకు ఖాతాలో పడింది. ఏడాదికి 41,500 డాలర్లు (మన రూపాయలలో 36 లక్షలు) అందుకుంటూ ఎంజాయ్ చేశాడు. ఆరేళ్లపాటు నిరాటంకంగా సాగిన గార్సియా వ్యవహారం 2010లో బయటపడింది. ఇరవై ఏళ్ల పాటు సంస్థకు సేవలందించిన నేపథ్యంలో గార్సియాకు సన్మానం చేయాలని ఉన్నతాధికారులు ప్రయత్నించడంతో ఈ మోసం బయటపడింది. దీంతో గార్సియాపై కాడిజ్ వాటర్ కంపెనీ కోర్టుకెక్కగా.. ఇటీవల తీర్పు వెలువరించింది. గార్సియాకు 30 వేల డాలర్ల జరిమానా (మన రూపాయలలో 25 లక్షలు) విధిస్తూ తీర్పు చెప్పింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :