Tuesday, 10 March 2026 03:47:45 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Hardik Pandya: గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా... వైర‌లవుతున్న పాత వీడియో!

గ‌తేడాది ఆగ‌స్టులో శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన టీమిండియా ఈ టూర్‌కి పాండ్యాతో పాటు వెళ్లిన‌ జాస్మిన్ వాలియా! ఆ స‌మ‌యంలో ఇద్ద‌రూ క‌లిసి తిరిగిన వీడియో

Date : 20 March 2025 12:22 PM Views : 208

Studio18 News - తాజా వార్తలు / : మ‌రో మూడు రోజుల్లో ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం కానున్న వేళ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ జాస్మిన్ వాలియాతో ఉన్న పాత వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గ‌తేడాది ఆగ‌స్టులో టీమిండియా, శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో పాండ్యాతో పాటు జాస్మిన్ కూడా వెళ్లిన‌ట్లు స‌మాచారం. కాగా, ఇటీవ‌ల ముగిసిన ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో జ‌రిగిన భార‌త మ్యాచ్‌ల‌కు ఆమె కూడా హాజ‌రయ్యారు. దీంతో వీరి మ‌ధ్య బంధం నిజ‌మ‌నే చ‌ర్చ మొద‌లైంది. దీనికి ఇప్పుడీ పాత వీడియో మరింత బలం చేకూరుస్తోంది. జాస్మిన్ స్టైలిష్ వైట్ సమ్మర్ డ్రెస్ ధరించి, ఎరుపు స్లింగ్ బ్యాగ్, వైట్ స్లైడర్‌లతో క్యాబ్ నుంచి దిగ‌డం వీడియోలో చూడొచ్చు. కొన్ని క్షణాల తర్వాత హార్దిక్ పాండ్యా అదే కారు నుంచి బయటకు వస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అతడు తెల్లటి స్లీవ్‌లెస్ టీ-షర్ట్, ట్రాక్ ప్యాంట్, కౌబాయ్ టోపీలో క్యాజువల్‌గా క‌నిపించాడు. ఇదిలా ఉంటే... హార్దిక్ పాండ్యా అతని మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ 2024 జూలైలో విడిపోతున్నట్లు ప్రకటించిన విష‌యం తెలిసిందే. నాలుగేళ్ల త‌మ వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు ఈ జంట జూలై 20న ఉమ్మడి ప్రకటన చేసింది. ఆ త‌ర్వాత బ్రిటిష్ గాయని, రియాలిటీ టీవీ స్టార్ అయిన‌ జాస్మిన్ వాలియాతో పాండ్యా ప్రేమాయ‌ణం న‌డుపుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :