Studio18 News - తాజా వార్తలు / : యూపీఐ, ఏటీఎంల ద్వారా ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి అందుబాటులోకి రానుంది. దీంతో ఈపీఎఫ్ నుంచి ఉద్యోగులు డబ్బులు తీసుకోవడం సులభతరం కానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి చేసిన ప్రతిపాదనలను లేబర్ అండ్ ఎంప్లాయ్ మెంట్ మినిస్టీ ఆమోదించింది. ఈ విషయాన్ని లేబర్ అండ్ ఎంప్లాయ్ మెంట్ శాఖ సెక్రటరీ సుమితా దావ్రా తెలిపారు.
ఏటీఎం ద్వారా ఉద్యోగులు రూ.లక్ష వరకు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చని సుమిత చెప్పారు. అలాగే, బ్యాంక్ అకౌంట్లకు డబ్బు బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. పీఎఫ్ నిధులు పొందే విషయంలో ఇకపై ఉద్యోగులు ఈ మార్పులను చూడబోతున్నారని చెప్పారు. డబ్బు విత్‌డ్రా మాత్రమే కాదు. ఉద్యోగులు తమ పీఎఫ్‌లో ఈ మేరకు డబ్బు ఉందో కూడా యూపీఐ ద్వారా తెలుసుకోవచ్చని సుమితా చెప్పారు. ఆటోమేటెడ్ సిస్టమ్ విధానంలో రూ.లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని అన్నారు. ఇటువంటి డిజిటలైజ్ విషయంలో ఈపీఎఫ్‌ఓ ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. నగదు ఉపసంహరణ సౌకర్యాల క్రమబద్ధీకరణ కోసం 120కి పైగా డేటాబేస్‌లను ఏకీకృతం చేశారని సుమిత చెప్పారు. క్లెయిమ్ ప్రాసెసింగ్ టైమ్ 3 రోజులకు తగ్గిందన్నారు. 95 % క్లెయిమ్‌లు ఆటోమేటెడ్ విధానంలోనే జరుగుతున్నాయని అన్నారు. లక్షలాది మంది ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నట్లు చెప్పారు.
Admin
Studio18 News