Tuesday, 10 March 2026 03:49:26 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Stalin: సొంత దేశంలోనే రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మనం బతకాల్సి వస్తుంది: డీలిమిటేషన్ మీటింగ్ లో స్టాలిన్

జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదన్న స్టాలిన్ మన సమ్మతి లేకుండానే పార్లమెంట్ లో చట్టాల రూపకల్పన జరుగుతుందని వ్యాఖ్య కేంద్రం నుంచి రావాల్సి

Date : 22 March 2025 03:10 PM Views : 223

Studio18 News - తాజా వార్తలు / : జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో చేసే చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. సొంత దేశంలోనే రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మనం బతకాల్సి వస్తుందని చెప్పారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా చెన్నైలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ పై నిర్వహించిన ఈ భేటీ చరిత్రలో నిలిచిపోతుందని స్టాలిన్ అన్నారు. ప్రస్తుత జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదని చెప్పారు. పార్లమెంట్ లో మన ప్రాతినిధ్యం తగ్గితే... మన అభిప్రాయాలను వ్యక్తపరిచే బలం తగ్గుతుందని అన్నారు. మన సమ్మతి లేకుండానే చట్టాల రూపకల్పన జరుగుతుందని చెప్పారు. మన ప్రమేయం లేకుండానే తీసుకునే నిర్ణయాలు మన ప్రజలపై ప్రభావం చూపుతాయని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల కోసం మనం పోరాడాల్సి ఉంటుందని చెప్పారు. మన విద్యార్థులు అవకాశాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం దెబ్బతింటుందని చెప్పారు. మన సాంప్రదాయాలు ప్రమాదంలో పడతాయని స్టాలిన్ అన్నారు. దేశ జనాభాను తగ్గించాలన్న అప్పటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా అమలు చేయడంతో... దక్షిణాది రాష్ట్రాల జనాభా ప్రస్తుతం తగ్గిపోయిందని స్టాలిన్ చెప్పారు. ఇదే సమయంలో ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల జనాభా భారీగా పెరిగిపోయిందని తెలిపారు. జనాభా నియంత్రణపై మన చర్యలకు ఎలాంటి రివార్డ్ రాలేదు సరికదా... ఇప్పుడు మనం రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదంలో పడ్డామని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :