Sunday, 15 March 2026 03:22:11 PM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

తన పాలతో 3.50 లక్షలకు పైగా పసికందుల ఆకలిని తీర్చింది.. అమెరికా మహిళ గిన్నిస్ రికార్డు

2010 నుంచి బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ మొదలు పెట్టిన అలిస్సా ఇప్పటి వరకు ఏకంగా 2,600 లీటర్ల పాలను డొనేట్ చేసిందన్న మిల్క్ బ్యాంక్ 2014లోనే గిన్నిస్ రికార్

Date : 10 November 2024 02:42 PM Views : 254

Studio18 News - ఆరోగ్యం / : తల్లి పాలు అమృతంతో పోలుస్తారు.. అలాంటి అమృతాన్ని తన బిడ్డలతో పాటు ఇతరులకూ పంచుతోందా తల్లి.. ఏళ్ల తరబడి తన పాలను డొనేట్ చేస్తూ లక్షలాది మంది పసికందుల ఆకలి తీర్చింది. మొత్తంగా ఆ తల్లి 2,600 లీటర్ల పాలను బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ కు డొనేట్ చేసింది. ఈ పాలతో దాదాపు 3.5 లక్షల మందికి పైగా పసికందుల ఆకలి తీర్చిందని మిల్క్ బ్యాంక్ పేర్కొంది. మిల్క్ బ్యాంకుకు పంపడంతో పాటు తన స్నేహితులు, తెలిసిన వాళ్లు, చుట్టుపక్కల వాళ్ల పిల్లలకూ తన పాలను ఇచ్చానని అమెరికాలోని టెక్సాస్‌ కు చెందిన అలిస్సా ఒగ్లెట్రీ చెబుతోంది. 2010లో కొడుకు పుట్టిన తర్వాత తనకు పాలు ఎక్కువగా పడ్డాయని, పిల్లాడు తాగిన తర్వాత పాలను పిండి మిల్క్ బ్యాంక్ కు ఇవ్వడం మొదలు పెట్టానని చెప్పారు. ఓ నర్స్ సాయంతో తానీ డొనేషన్ కార్యక్రమం మొదలు పెట్టానని వివరించారు. తల్లి పాలు సరిపోక పోవడం, కవలలు జన్మించిన సందర్భాల్లో, పుట్టిన వెంటనే తల్లిని కోల్పోయిన పిల్లలను బ్రెస్ట్ మిల్క్ బ్యాంకులు ఆదుకుంటాయని చెప్పారు. ఆ బ్యాంకులకు డొనేట్ చేయడం ద్వారా అవసరంలో ఉన్న చిన్నారుల ఆకలి తీర్చవచ్చని అలిస్సా వివరించారు. ప్రస్తుతం అలిస్సా వయసు 36 సంవత్సరాలు.. 2010 నుంచి ఆమె బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేస్తున్నారు. నాలుగేళ్లలో 1,569 లీటర్ల బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేసి 2014లో అలిస్సా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. టెక్సాస్‌ లోని బ్రెస్ట్ మిల్క్ బ్యాంకుకు ఆమె డొనేషన్ ప్రస్తుతం 2,645 లీటర్లకు చేరింది. ఒక్క లీటర్ తల్లిపాలతో 11 మంది పసికందుల ఆకలి తీర్చవచ్చని మిల్క్ బ్యాంక్ సిబ్బంది చెప్పారు. ఈ లెక్కన అలిస్సా ఇప్పటి వరకు డొనేట్ చేసిన పాలతో ఏకంగా 3.50 లక్షల మంది చిన్నారుల ఆకలి తీర్చామని వివరించారు.

Also Read : కెనడా బోర్డర్ లో అలర్ట్... అమెరికా నుంచి అక్రమ వలసలు!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :