Friday, 13 March 2026 02:00:20 PM
# ఏల్గొండ గూడ పాఠశాలకు దాత సహాయం # నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి # శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి

Infertility: వాయు కాలుష్యంతో పురుషుల్లో సంతాన లేమి!

Date : 06 September 2024 03:28 PM Views : 234

Studio18 News - ఆరోగ్యం / : వాయు కాలుష్యానికి గురైన పురుషులకు సంతానలేమి ముప్పు పొంచి ఉన్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. దీర్ఘకాలం పాటు ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం 2.5) వాయు కాలుష్యాన్ని గురైన పురుషుల్లో వంధ్యత్వం ఏర్పడే ముప్పు అధికంగా ఉందని డెన్మార్క్ అధ్యయనం పేర్కొంది. నార్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు బీఎంజే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ప్రపంచంలోని ప్రతి ఏడుగురు జంటల్లో ఒకటి సంతానలేమి సమస్యతో బాధపడుతోంది. పీఎం 2.5 పురుషులపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. 2000-2017 మధ్య డెన్మార్క్‌లో 30-45 ఏళ్ల వయసున్న 5,26,056 మందిపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. పీఎం 2.5కి ఐదేళ్లకు పైన గురైన 30-45 ఏళ్ల వయసున్న వారిలో వంధ్యత్య ముప్పు 24 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనం వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటు పెరగాలంటే వాయు కాలుష్యాన్ని ప్రభుత్వాలు నివారించాల్సిన అవసరాన్ని అధ్యయనం నొక్కి చెప్పింది. నాణ్యమైన గాలిని పొందడం మానవ హక్కు అని, కాబట్టి ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేయాలని సూచించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :