Friday, 13 March 2026 01:58:08 PM
# ఏల్గొండ గూడ పాఠశాలకు దాత సహాయం # నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి # శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి

Iron Deficiency: గర్భధారణ సమయంలో 80 శాతం మంది మహిళల్లో ఐరన్ లోపం.. దానివల్ల ఎన్ని ప్రమాదాలో తెలుసా?

Date : 28 September 2024 11:57 AM Views : 266

Studio18 News - ఆరోగ్యం / : గర్భం ధరించే సమయంలో 80 శాతం మందికిపైగా మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. సాధారణంగా గర్భం ధరించే సమయంలో మహిళలకు ఐరన్ చాలా అవసరం. పెరుగుతున్న పిండం అభివృద్ధి చెందేందుకు సాధారణంగా ఉండాల్సిన ఐరన్‌తో పోలిస్తే పదిరెట్లు ఎక్కువ అవసరమవుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళ శరీరం ఎక్కువ ఐరన్‌ను శోషించుకుంటుంది. అయితే దాదాపు 50 శాతం మంది మహిళలు గర్భం ధరించే సమయంలో అతి తక్కువ ఐరన్‌ కలిగి ఉన్నట్టు అధ్యయనం పేర్కొంది. ఇనుము వనరులు తక్కువగా ఉన్న దేశాల్లో మాత్రమే కాదు.. ఆశ్చర్యకరంగా ఎక్కువ వనరులు ఉన్న దేశాల్లోనూ 33-42 శాతం మంది మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారట. శరీరంలో ఐరన్ లోపం రక్త హీనతకు దారితీస్తుంది. దీనివల్ల సరిపడా హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడంలో శరీరం ఇబ్బందిపడుతుంది. ఫలితంగా శరీరమంతా ఆక్సిజన్ సరఫరా ఎర్రరక్తకణాల సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది బిడ్డకు జన్మనిచ్చే సమయంలో తల్లీపిల్లలు ఇద్దరికీ ముప్పుగా పరిణమిస్తుందని అధ్యయనం వెల్లడించింది. ఐరన్ లోపం వల్ల నెలలు నిండకుడానే పిల్లలు పుట్టడం, బరువు తక్కువగా ఉండడం, దీర్ఘకాలంగా న్యూరోడెవలప్‌మెంట్ సమస్యలు వెంటాడతాయని అధ్యయనకారులు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :