Friday, 13 March 2026 01:59:58 PM
# ఏల్గొండ గూడ పాఠశాలకు దాత సహాయం # నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి # శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి

lung cancer: లంగ్ క్యాన్సర్ కు వ్యాక్సిన్ సిద్ధం.. రోగులపై మొదలైన ట్రయల్స్!

Date : 24 August 2024 11:40 AM Views : 241

Studio18 News - ఆరోగ్యం / : ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణమైన వ్యాధుల్లో కేన్సర్ ముందు వరుసలో ఉంది. వీటిలో ఊపిరితిత్తుల కేన్సర్ వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఏటా 1.8 మిలియన్ల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా ఊపిరితిత్తుల కేన్సర్ కు బ్రిటన్ పరిశోధకుల బృందం టీకా (వ్యాక్సిన్) రూపొందించింది. BNT116 పేరిట రూపొందించిన టీకాను శుక్రవారం యూకేకి చెందిన ఓ ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగిపై ప్రయోగించారు. కోటి ఆశలతో వ్యాక్సిన్ పని తీరును పరిశీలిస్తున్నారు. ఇది విజయవంతం అయితే వేలాది మంది ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ వ్యాక్సిన్ ను బయోఎన్‌టెక్ కంపెనీ రూపొందించగా, జానస్జ్ రాక్జ్‌కు జబ్ (67) అనే ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుడికి ఆరు సిరంజీల వ్యాక్సిన్ ను శుక్రవారం ఇచ్చారు. ఈ సందర్భంగా తొలి వ్యాక్సిన్ వేయించుకున్న జానస్జ్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగం సక్సెస్ అయితే తనలా ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న వందలాది మందికి ఉపయోగపడుతుందన్నారు. వ్యాక్సిన్ ప్రయోగంలో తాను మొదటి వ్యక్తినా? లేక వందో వ్యక్తినా? అనే విషయంలో తనకు పట్టింపు లేదని అన్నారు. ఇది సహాయపడుతుందని తాను నమ్ముతున్నానని అన్నారు. వ్యాక్సిన్ వేగంగా ఉత్పత్తికి వెళితే ఇతర రోగుల ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. కీమోథెరఫీ కంటే చాలా కచ్చితత్వంతో ఇది పని చేస్తుందని యూనివర్శిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్ వైద్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన కణాలపై ఏ విధమైన నష్టాన్ని కలిగించదని స్పష్టం చేశారు. నొప్పి లేకుండా వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. ఇది కీమో కంటే చాలా బెటర్ చికిత్స అని వెల్లడించారు. రోగి శరీరంలోని క్యాన్సర్ కణితులను గుర్తించి వాటిపై పోరాడటానికి రోగ నిరోధక వ్యవస్థలకు శిక్షణ ఇస్తుందని, ఇది రోగ నిరోధక ప్రతిస్పందనలను అణచివేసే కణాలను సమర్ధవంతంగా తొలగించగలుగుతుందని వైద్యులు వెల్లడించారు. రోగులపై ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ ఇంకా అమెరికా, జర్మనీ, హంగేరీ, పోలెండ్, టర్కీ, స్పెయిన్ దేశాలలో కూడా మొదలయ్యాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :