Wednesday, 11 March 2026 11:43:04 AM
# సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన # అంగన్వాడీ టీచర్ ఒడ్డేపల్లి రాజేశ్వరికు బెస్ట్ టీచర్ అవార్డు # టేకులబస్తిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ స్లాబ్ పనులు ప్రారంభం # విలేకరి చంద్రశేఖర్‌పై నమోదైన కేసు రద్దు చేయాలి: బీజేపీ నాయకుడు కొయ్యల ఏమాజి # బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ కూనురాజుల సమ్మక్కకు పిహెచ్డీ డాక్టరేట్ # మందమర్రి పెద్ద మసీదులో రంజాన్ తోఫా కార్యక్రమం… మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొనం # నాగర్ గూడ శివారులో సీజ్ చేసిన ఇసుకకు బహిరంగ వేలం # బీజేపీ పోరాటంతో భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాలు # కోమట్లగూడెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి జాతర సందర్భంగా డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం # కుషాయిగూడలో ఘనంగా రేణుక ఎల్లమ్మ–జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం

Tea Or Coffee | టీ లేదా కాఫీ.. రెండింటిలో అస‌లు కెఫిన్ ఎంత మోతాదులో ఉంటుంది..? దేన్ని తీసుకోవాలి..?

మ‌న దేశంలో టీ, కాఫీలు ఎక్కువ‌గా తాగే పానీయాలు అని చెప్ప‌వ‌చ్చు. టీ లేదా కాఫీల‌ను దాదాపు ఉద‌యం పూట ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో తాగుతారని చెప్ప‌వ‌చ్చు. కొంద‌ర

Date : 27 January 2026 07:44 PM Views : 54

Studio18 News - ఆరోగ్యం / : Tea Or Coffee | మ‌న దేశంలో టీ, కాఫీలు ఎక్కువ‌గా తాగే పానీయాలు అని చెప్ప‌వ‌చ్చు. టీ లేదా కాఫీల‌ను దాదాపు ఉద‌యం పూట ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో తాగుతారని చెప్ప‌వ‌చ్చు. కొంద‌రైతే వారి రోజును టీ, కాఫీల‌తోనే ప్రారంభిస్తారు. ఉద‌యం పూట వీటిని తాగ‌నిదే వారికి రోజు గ‌డిచిన‌ట్టుగా ఉండ‌దు. శ‌క్తి, ప్రేగు క‌ద‌లిక‌ల‌కు, శ‌రీరం ఉత్తేజానికి ఎవ‌రి రుచిని బ‌ట్టి వారు టీ లేదా కాఫీల‌ను తాగుతూ ఉంటారు. ఇవి రెండు కూడా ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందించిన‌ప్ప‌టికీ దేనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి మేలు క‌లుగుతుంది అనే సందేహం మ‌న‌లో చాలా మందికి వ‌స్తూనే ఉంటుంది. నిజానికి టీ, కాఫీల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల వివిధ ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలను అందిస్తున్న‌ప్ప‌టికీ వీటిలో ఉండే కెఫిన్ మోతాదులో చాలా వ్య‌త్యాసం ఉంటుంది. టీ లో కంటే కాఫీలో రెండు రెట్లు ఎక్కువ‌గా కెఫిన్ ఉంటుంది. కాఫీలో 80 నుండి 100మి.గ్రా., టీలో 30 నుండి 50 మి.గ్రా. కెఫిన్ ఉంటుంది. తేడాలు ఇవే.. కెఫిన్ ఎక్కువ‌గా ఉండే కాఫీని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు మ‌రింత శ‌క్తి ల‌భిస్తుంది. శారీర‌క ప‌నితీరు మెరుగుప‌డుతుంది. ఏకాగ్ర‌త పెరుగుతుంది. కెఫిన్ మోతాదును త‌ట్టుకునే వారికి, ఎల్ల‌ప్పుడూ బ‌ల‌మైన మాన‌సిక, శారీర‌క ప్రోత్సాహాన్ని కోరుకునే వారికి, ఉద‌యం పూట వ్యాయామాలు చేసే వారికి కాఫీ మంచి ఎంపిక అని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే కాఫీని తీసుకోవ‌డం వ‌ల్ల దానిలో ఉండే స‌మ్మేళ‌నాలు ఇరిట‌బుల్ బ‌వెల్ సిండ్రోమ్ ల‌క్ష‌ణాల‌ను ప్రేరేపిస్తాయి. దీంతో జీర్ణ‌క్రియ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. క‌నుక కాఫీ అంద‌రికి త‌గిన‌ది కాద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక టీ విష‌యానికి వ‌స్తే టీ పొట్ట‌కు చాలా తేలిక‌గా ఉంటుంది. ఇందులో కెఫిన్ త‌క్కువ‌గా ఉంటుంది. అలాగే అల్లం, మ‌సాలా వంటి టీల‌ను తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. దేనిని ఎంచుకోవాలి..? ఇక దేనిని ఎంచుకోవాలి అనే విష‌యానికి వ‌స్తే అది మీ రుచి, ప్రాధాన్య‌త మీద ఆధార‌ప‌డి ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది టీ, కాఫీ రెండింటిని తాగుతూ ఉంటారు. అయితే అధిక‌ కెఫిన్ ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌స‌మ‌స్య‌లకు, నిద్ర‌లేమి వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి అని భావించే వారు హెర్బ‌ల్ టీల‌ను తీసుకోవ‌డం మంచిది. అదే విధంగా FDA సాధార‌ణ కెఫిన్ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం మ‌నం రోజుకు 400మి.గ్రా. ల కంటే ఎక్కువ కెఫిన్ ను తీసుకోకూడ‌దు. కాఫీ లేదా టీ దేనిని తీసుకున్నా కూడా ముందుగా వాటిపై ఉండే లేబుల్స్ ను చూసి తీసుకోవ‌డం మంచిది. అలాగే వాటిలో ఎంత మోతాదులో పాలు, చ‌క్కెర వంటి వాటిని క‌ల‌పాలో ముందుగానే తెలుసుకోవ‌డం మంచిది. అలాగే టీ లేదా కాఫీ దేనిని తీసుకున్న కూడా చ‌క్కెర మోతాదు త‌క్కువ‌గా ఉండేలా చూసుకోవ‌డం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :