Wednesday, 11 March 2026 11:43:25 AM
# సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన # అంగన్వాడీ టీచర్ ఒడ్డేపల్లి రాజేశ్వరికు బెస్ట్ టీచర్ అవార్డు # టేకులబస్తిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ స్లాబ్ పనులు ప్రారంభం # విలేకరి చంద్రశేఖర్‌పై నమోదైన కేసు రద్దు చేయాలి: బీజేపీ నాయకుడు కొయ్యల ఏమాజి # బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ కూనురాజుల సమ్మక్కకు పిహెచ్డీ డాక్టరేట్ # మందమర్రి పెద్ద మసీదులో రంజాన్ తోఫా కార్యక్రమం… మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొనం # నాగర్ గూడ శివారులో సీజ్ చేసిన ఇసుకకు బహిరంగ వేలం # బీజేపీ పోరాటంతో భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాలు # కోమట్లగూడెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి జాతర సందర్భంగా డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం # కుషాయిగూడలో ఘనంగా రేణుక ఎల్లమ్మ–జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం

Pop Corn | పాప్ కార్న్ అస‌లు మ‌న ఆరోగ్యానికి మంచిదేనా..? దీన్ని తింటే ఏం జ‌రుగుతుంది..?

మ‌నం ఆహారంగా తీసుకునే చిరుతిళ్ల‌ల్లో పాప్‌కార్న్ కూడా ఒకటి. పిల్ల‌లు దీనిని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. పాప్‌కార్న్ ను ఎక్కువ‌గా సినిమా వీక్షించే స‌మ‌యంల

Date : 29 December 2025 07:57 PM Views : 104

Studio18 News - ఆరోగ్యం / : Pop Corn | మ‌నం ఆహారంగా తీసుకునే చిరుతిళ్ల‌ల్లో పాప్‌కార్న్ కూడా ఒకటి. పిల్ల‌లు దీనిని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. పాప్‌కార్న్ ను ఎక్కువ‌గా సినిమా వీక్షించే స‌మ‌యంలో చిరుతిండిగా తింటూ ఉంటారు. టైంపాస్ గా తీసుకునేదే అయినా పాప్‌కార్న్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. అయితే ఈ పాప్‌కార్న్ మార్కెట్ లో మ‌న‌కు వివిధ రుచుల్లో ల‌భిస్తుంది. ఇన్‌స్టాంట్ గా చేసుకునే ఈ పాప్‌కార్న్ లో ఉప్పు, బ‌ట‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇలాంటి పాప్‌కార్న్ ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో హాని క‌లుగుతుంది. క‌నుక మ‌నం మైక్రోవేవ్ చేసుకోగ‌లిగిన ఎటువంటి ఫ్లేవ‌ర్స్ లేని పాప్‌కార్న్ ను మాత్ర‌మే తీసుకోవాలి. ఇలాంటి పాప్‌కార్న్ మాత్ర‌మే మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పాప్‌కార్న్ మ‌న ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుంది.. వీటిలో ఉండే ముఖ్య‌మైన పోష‌కాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను పోష‌కాహార నిపుణులు వివ‌రిస్తున్నారు. ఫైబ‌ర్ ఎక్కువ‌గా.. పాప్‌కార్న్ ను 100 శాతం తృణ‌ధాన్యాల‌తో త‌యారు చేస్తారు. క‌నుక దీనిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. దీనిలో ఉండే ఫైబ‌ర్ ప్రేగు క‌ద‌లిక‌ల‌ను పెంచి మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా పాప్‌కార్న్ ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. ఈ గింజ‌ల్లో ఉండే ఫైబ‌ర్ కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఇక మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తుల‌కు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఫైబ‌ర్ ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది. క‌నుక మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులకు ఇది ఒక చ‌క్క‌టి చిరుతిండి అని చెప్ప‌వ‌చ్చు. యాంటీ ఆక్సిడెంట్లు.. పాప్‌కార్న్ లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే పాలీఫినాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు శ‌రీరంలో ఉండే ఫ్రీరాడిక‌ల్స్ ను న‌శింప‌జేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. దీంతో క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధుల బారిన ప‌డ‌కుండా మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌చ్చు. అంతేకాకుండా పాప్‌కార్న్ ను తీసుకోవ‌డం వ‌ల్ల వృద్ధాప్యం, చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌డం, అల్జీమ‌ర్స్, జుట్టు రాల‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. పాప్‌కార్న్ లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. పాప్‌కార్న్ ను తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నిండుగా ఉంటుంది. త్వ‌ర‌గా ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది. త‌ద్వారా మ‌న శ‌రీర బ‌రువు అదుపులో ఉంటుంది. గ్లూటెన్ ర‌హితం.. పాప్‌కార్న్ గ్లూటెన్ ర‌హిత‌మైన‌ది. క‌నుక బ్రెడ్ కు బ‌దులుగా ఏ రెసిపీలోనైనా పాప్‌కార్న్ ను వాడుకోవ‌చ్చు. చిరుతిండిగా తీసుకోవ‌డానికి కూడా ఇది ఆరోగ్య‌క‌ర‌మైన‌ది. ఈ విధంగా పాప్‌కార్న్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే దీనిని ఉప్పు, కారం, వెన్న, చీజ్, క్యార‌మెల్ వంటి వివిధ ప్లేవ‌ర్స్ తో తీసుకోకూడ‌దు. ఇలా తీసుకుంటే మేలు జ‌ర‌గ‌డానికి బ‌దులుగా మ‌న శ‌రీరానికి తీవ్ర‌మైన హాని క‌లుగుతుంది. క‌నుక ఎటువంటి ఫ్లేవ‌ర్స్ లేకుండా ఉండే సాధార‌ణ పాప్‌కార్న్ గింజ‌ల‌ను మాత్ర‌మే తీసుకోవాలి. అప్పుడే మ‌నం వాటి వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :