Friday, 13 March 2026 02:00:19 PM
# ఏల్గొండ గూడ పాఠశాలకు దాత సహాయం # నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి # శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి

Ozempic: భారత్‌లోకి వచ్చేసిన బరువు తగ్గించే ఒజెంపిక్ ఇంజెక్షన్.. నెల రోజుల డోసు ప్రారంభ ధ‌ర ఎంతంటే..!

Date : 12 December 2025 07:04 PM Views : 116

Studio18 News - ఆరోగ్యం / : ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన ఒజెంపిక్ ఇంజెక్షన్ భారత్‌లో విడుదల టైప్ 2 డయాబెటిస్ నియంత్రణకు అధికారికంగా అనుమతి బరువు తగ్గడానికి కూడా ఈ ఔషధాన్ని విస్తృతంగా వినియోగిస్తున్న వైనం నెల రోజుల డోసు ప్రారంభ ధర రూ. 8,800గా నిర్ణయం గుండె, కిడ్నీ సమస్యల నుంచి కూడా రక్షణ కల్పిస్తుందన్న సంస్థ ప్రపంచవ్యాప్తంగా బరువు తగ్గించే ఔషధంగా సంచలనం సృష్టించిన 'ఒజెంపిక్' (Ozempic) ఇంజెక్షన్ ఇప్పుడు భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఫార్మా సంస్థ నోవో నార్డిస్క్ ఈరోజు ఈ ఔషధాన్ని దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. టైప్ 2 మధుమేహం నియంత్రణ కోసం అధికారికంగా అనుమతి పొందిన ఈ డ్రగ్‌కు, బరువు తగ్గించే గుణం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది. దీని నెల రోజుల డోసు ప్రారంభ ధర రూ. 8,800గా ఉంది. ఒజెంపిక్ (సెమాగ్లుటైడ్) అనేది వారానికి ఒకసారి తీసుకునే ఇంజెక్షన్. ఇది 0.25mg, 0.5mg, 1mg డోసుల్లో లభిస్తుంది. నొప్పి లేకుండా సులభంగా ఇంజెక్ట్ చేసుకునేందుకు వీలుగా 'నోవోఫైన్ నీడిల్స్' అనే ప్రీ-ఫిల్డ్ పెన్ రూపంలో దీన్ని అందిస్తున్నారు. ప్రారంభ డోస్ అయిన 0.25mg పెన్ ధర రూ. 8,800 కాగా, 0.5mg ధర రూ. 10,170, 1mg ధర రూ. 11,175గా కంపెనీ నిర్ణయించింది. ప్రతి పెన్‌లో నాలుగు వారాలకు సరిపడా డోసులు ఉంటాయి. ఈ సందర్భంగా నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా మాట్లాడుతూ... "ఒజెంపిక్‌ను భారత్‌కు తీసుకురావడం ఒక ముఖ్యమైన మైలురాయి. ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన క్లినికల్ ఫలితాలతో వస్తున్న ఈ ఔషధం భారతీయ వైద్యులకు ఒక సమర్థవంతమైన చికిత్సా మార్గాన్ని అందిస్తుంది. సులభంగా వాడే పెన్ ద్వారా మెరుగైన గ్లూకోజ్ నియంత్రణ, బరువు నియంత్రణ, గుండె, కిడ్నీలకు దీర్ఘకాలిక రక్షణ అందించడమే మా లక్ష్యం" అని వివరించారు. అమెరికా ఎఫ్‌డీఏ 2017లో టైప్ 2 డయాబెటిస్ కోసం ఒజెంపిక్‌కు ఆమోదం తెలిపింది. అయితే, ఇది ఆకలిని నియంత్రించగలగడంతో బరువు తగ్గడం కోసం దీని వాడకం విపరీతంగా పెరిగింది. ఇది జీఎల్‌పీ-1 రిసెప్టార్ అగోనిస్ట్‌గా పనిచేస్తూ, మెదడులోని ఆకలి కేంద్రాలపై ప్రభావం చూపుతుంది. మధుమేహంతో సంబంధం ఉన్న గుండె, కిడ్నీ సంబంధిత సమస్యల ముప్పును కూడా తగ్గిస్తుందని నోవో నార్డిస్క్ పేర్కొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :