Friday, 13 March 2026 02:01:20 PM
# ఏల్గొండ గూడ పాఠశాలకు దాత సహాయం # నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి # శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి

Dinner Ideas For Weight Loss | రాత్రి పూట మీరు తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి.. అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు..

అధికంగా బ‌రువు ఉన్న‌వారు రాత్రి పూట భోజ‌నాన్ని త్వ‌ర‌గా ముగిస్తుంటారు. రాత్రి పూట తినే ఆహారంలో చ‌పాతీల‌ను చేర్చుకుంటారు. అంతే కాదు రాత్రి పూట ఆహారాన్న

Date : 11 October 2025 07:21 PM Views : 186

Studio18 News - ఆరోగ్యం / : Dinner Ideas For Weight Loss | అధికంగా బ‌రువు ఉన్న‌వారు రాత్రి పూట భోజ‌నాన్ని త్వ‌ర‌గా ముగిస్తుంటారు. రాత్రి పూట తినే ఆహారంలో చ‌పాతీల‌ను చేర్చుకుంటారు. అంతే కాదు రాత్రి పూట ఆహారాన్ని త‌క్కువ‌గా తింటారు. ఇలా బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు రాత్రి భోజ‌నం ప‌ట్ల అనేక జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తుంటారు. అయితే బ‌రువు త‌గ్గాలంటే ప‌లు ఆహారాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. స‌రైన పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తింటే బ‌రువు త‌గ్గ‌డం తేలిక‌వుతుంది. ఈ క్ర‌మంలోనే రాత్రి పూట కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల సుల‌భంగా బ‌రువు త‌గ్గుతారు. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి క‌నుక ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే ప్ర‌ణాళిక‌లో ఉన్న వారు రాత్రి పూట ఈ ఆహారాల‌ను తీసుకుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది. స్కిన్‌లెస్ చికెన్‌, చేప‌లు, కూర‌గాయ‌లు.. రాత్రి పూట ఆహారంలో స్కిన్ లెస్ చికెన్ తిన‌వ‌చ్చు. ఇది అద్భుత‌మైన ప్రోటీన్ల‌ను అందిస్తుంది. అలాగే రాత్రి పూట ఆహారంలో చేప‌ల‌ను తింటున్నా మేలు జ‌రుగుతుంది. చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తాయి. సోయా టోఫులో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీరానికి శ‌క్తిని అందించ‌డంతోపాటు బ‌రువు త‌గ్గేందుకు దోహ‌దం చేస్తాయి. ప‌ప్పు దినుసులు, శ‌న‌గ‌ల‌ను తింటున్నా కూడా ఫ‌లితం ఉంటుంది. వీటిల్లో ఫైబ‌ర్‌, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి బ‌రువు త‌గ్గేలా చేస్తాయి. పిండి ప‌దార్థాలు చాలా త‌క్కువ‌గా ఉండే కూర‌గాయ‌ల‌ను రాత్రి పూట తినాల్సి ఉంటుంది. పాల‌కూర‌, బ్రోక‌లీ, కాలిఫ్ల‌వ‌ర్‌, మొల‌క‌లు, క్యాప్సికం, పుట్ట గొడుగులు, గ్రీన్ బీన్స్ వంటి ఆహారాల‌ను రాత్రి పూట తింటుంటే మేలు జ‌రుగుతుంది. కినోవా, బ్రౌన్ రైస్‌.. సంక్లిష్ట‌మైన పిండి ప‌దార్థాలు ఉండే ఆహారాల‌ను తింటున్నా కూడా ఉప‌యోగం ఉంటుంది. కినోవా, బ్రౌన్ రైస్‌, చిల‌గ‌డ‌దుంప‌లు వంటి వాటిల్లో సంక్లిమైన పిండి ప‌దార్థాలు ఉంటాయి. ఇవి ర‌క్తంలో గ్లూకోజ్‌గా మారేందుకు స‌మ‌యం ప‌డుతుంది. పైగా వీటిని కాస్త తిన్నా చాలు, వీటిల్లో ఉండే ఫైబ‌ర్ కార‌ణంగా క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇలా ఇవి బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తాయి. ఆరోగ్య‌క‌రమైన కొవ్వ‌లు ఉండే ఆహారాల‌ను కూడా రాత్రి పూట తిన‌వ‌చ్చు. అవ‌కాడో, బాదంప‌ప్పు, వాల్ న‌ట్స్, చియా సీడ్స్‌ను రాత్రి పూట తిన‌వ‌చ్చు. అలాగే ఆలివ్ ఆయిల్‌ను కూడా తీసుకోవ‌చ్చు. ఇవ‌న్నీ రాత్రి పూట తీసుకోద‌గిన ఆహారాలు. అలాగే బ‌రువు త‌గ్గేందుకు కూడా ఇవి ఎంత‌గానో దోహ‌దం చేస్తాయి. ఈ కాంబినేష‌న్ ట్రై చేయండి.. రాత్రిపూట ఆహారంలో చేప‌ల‌ను, కూర‌గాయ‌ల‌ను క‌లిపి కాంబినేష‌న్‌లో తిన‌వ‌చ్చు. లేదా చికెన్‌, వెజిట‌బుల్ స‌లాడ్, ఫ్రూట్ స‌లాడ్ వంటి వాటిని క‌లిపి తీసుకోవ‌చ్చు. బ్రౌన్ రైస్‌, వెజిట‌బుల్ సూప్‌ను క‌లిపి తీసుకోవ‌చ్చు. సోయా టోఫు, కూర‌గాయ‌ల‌ను క‌లిపి కూడా తిన‌వ‌చ్చు. ఇలా రాత్రి పూట భోజ‌నాన్ని ప్లాన్ చేసుకోవ‌చ్చు. అయితే ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తిన్న‌ప్ప‌టికీ వీటిని రాత్రి పూట త‌క్కువ మోతాదులోనే తినాలి. ఇత‌ర ఆహారాల‌తో పోలిస్తే ఇవి బ‌రువు త‌గ్గేందుకు మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కానీ ఎక్కువ మోతాదులో మాత్రం తిన‌కూడ‌దు. ఇక రాత్రి పూట భోజ‌నాన్ని వీలైనంత త్వ‌ర‌గా తినేయాల్సి ఉంటుంది. భోజ‌నానికి, నిద్ర‌కు మ‌ధ్య క‌నీసం 2 నుంచి 3 గంటల వ్య‌వధి ఉండేలా చూసుకోవాలి. చ‌క్కెర ఉండే ఆహారాలు, ప్రాసెస్ ఫుడ్స్, శీత‌ల పానీయాల‌ను తాగ‌కూడ‌దు. ఇలా ఆహార‌పు అల‌వాట్ల‌ను పాటిస్తుంటే అధిక బ‌రువును చాలా తేలిగ్గా త‌గ్గించుకోవ‌చ్చు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :