Wednesday, 11 March 2026 11:42:39 AM
# సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన # అంగన్వాడీ టీచర్ ఒడ్డేపల్లి రాజేశ్వరికు బెస్ట్ టీచర్ అవార్డు # టేకులబస్తిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ స్లాబ్ పనులు ప్రారంభం # విలేకరి చంద్రశేఖర్‌పై నమోదైన కేసు రద్దు చేయాలి: బీజేపీ నాయకుడు కొయ్యల ఏమాజి # బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ కూనురాజుల సమ్మక్కకు పిహెచ్డీ డాక్టరేట్ # మందమర్రి పెద్ద మసీదులో రంజాన్ తోఫా కార్యక్రమం… మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొనం # నాగర్ గూడ శివారులో సీజ్ చేసిన ఇసుకకు బహిరంగ వేలం # బీజేపీ పోరాటంతో భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాలు # కోమట్లగూడెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి జాతర సందర్భంగా డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం # కుషాయిగూడలో ఘనంగా రేణుక ఎల్లమ్మ–జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం

Foods To Avoid At Night | రాత్రి పూట ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఆహారాల‌ను తీసుకోకూడ‌దు.. ఎందుకంటే..?

మ‌నం తీసుకునే ఆహారంపైనే మ‌న శ‌రీర ఆరోగ్యం ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌న ఆరోగ్య‌మే కాకుండా మ‌న నిద్ర కూడా మ‌నం తీసుకునే ఆహారంపైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని మీకు తెల

Date : 02 January 2026 07:40 PM Views : 86

Studio18 News - ఆరోగ్యం / : Foods To Avoid At Night | మ‌నం తీసుకునే ఆహారంపైనే మ‌న శ‌రీర ఆరోగ్యం ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌న ఆరోగ్య‌మే కాకుండా మ‌న నిద్ర కూడా మ‌నం తీసుకునే ఆహారంపైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని మీకు తెలుసా. మారిన జీవ‌న విధానం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది జంక్ ఫుడ్ ను తీసుకుంటూ ఉన్నారు. ఇది మ‌న నిద్ర‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది. నిద్ర‌లేమి స‌మ‌స్యలు కూడా త‌లెత్తుతాయి. అంతేకాకుండా రాత్రి పూట స‌రిగ్గా నిద్రించ‌క‌పోవ‌డం వల్ల మ‌రుస‌టి రోజు చిరుతిళ్ల‌ను తినాల‌నే కోరిక క‌లుగుతుంది. క‌నుక మ‌నం నిద్రించే ముందు తీసుకోవాల్సిన ఆహారంపై త‌గిన శ్ర‌ద్ద చూపించ‌డం చాలా అవ‌స‌రం. మ‌నం తీసుకునే భోజ‌న‌మే మ‌న నిద్ర నాణ్య‌త‌ను ప్ర‌భావితం చేస్తుంది. క‌నుక‌ రాత్రి భోజ‌న విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిది. రాత్రి భోజ‌నంలో కొన్ని ఆహారాల‌ను నిషేధించాలి. రాత్రి భోజ‌నంలో తీసుకోకూడ‌ని కొన్ని ఆహారాల గురించి పోష‌కాహార నిపుణులు వివ‌రిస్తున్నారు. కారంగా ఉండే ఆహారాలు.. కారంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వల్ల గుండెల్లో మంట‌, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. దీని వ‌ల్ల నిద్ర‌పోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. క‌నుక వీటికి బ‌దులు నిద్రించే ముందు హెర్బ‌ల్ టీ లేదా పెరుగన్నం వంటి ఆహారాల‌ను తీసుకోవ‌డం మంచిది. కాఫీ, టీ ల‌లో కెఫీన్ ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల వీటిలో ఉండే కెఫీన్ శ‌రీరంలో గంట‌ల త‌ర‌బ‌డి ఉంటుంది. ఇది నిద్ర‌కు అంత‌రాయం క‌లిగిస్తుంది. క‌నుక కెఫీన్ కు బ‌దులుగా గోరు వెచ్చ‌ని పాలు, హెర్బ‌ల్ టీ ల‌ను తీసుకోవ‌డం ఉత్త‌మం. మ‌ద్యం తీసుకోవ‌డం వ‌ల్ల మొద‌ట్లో నిద్రపోయిన‌ప్ప‌టికీ ఇది నిద్ర చ‌క్రానికి ఆటంకం క‌లిగిస్తుంది. ఫలితంగా నిద్ర‌లేమితో పాటు నిద్ర నాణ్య‌త కూడా లోపిస్తుంది. క‌నుక నిద్రించే ముందు ఆల్క‌హాల్ ను తీసుకోక‌పోవ‌డమే మంచిది. కొవ్వు ఉండే ఆహారాలు సుల‌భంగా జీర్ణ‌మ‌వ్వ‌వు. దీంతో క‌డుపులో అసౌక‌ర్యం, నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. క‌నుక నిద్రించే ముందు పండ్లు, కూర‌గాయ‌లు వంటి ఆహారాల‌ను తీసుకోవాలి. చ‌క్కెర ఆహారాలు.. చ‌క్కెర క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరుగుతాయి. దీని వ‌ల్ల శ‌క్తి త‌గ్గిపోతుంది.నిద్ర‌పోవ‌డం క‌ష్టంగా మారుతుంది. క‌నుక నిద్రించే ముందు చ‌క్కెర క‌లిగిన ఆహారాల‌ను తీసుకోకూడ‌దు. నిద్రించే ముందు ఎక్కువ‌గా భోజ‌నం చేయ‌డం వ‌ల్ల క‌డుపులో అసౌక‌ర్యంగా ఉంటుంది. దీని వ‌ల్ల నిద్ర‌కు అంత‌రాయం క‌లుగుతుంది. క‌నుక ప‌డుకోవ‌డానికి కొన్ని గంట‌ల ముందుగానే తేలిక‌గా జీర్ణ‌మ‌య్యే ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్ లో అనారోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ఇవి త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వ్వ‌వు. నిద్ర‌కు, జీర్ణ‌క్రియ‌కు అంత‌రాయాన్ని క‌లిగిస్తాయి. క‌నుక పండ్లు, కూర‌గాయ‌లు, తృణ‌ధాన్యాలు వంటి ఆహారాన్ని ఎంచుకోవ‌డం ఉత్త‌మం. కార్బోనేటెడ్ పానీయాలు క‌డుపు ఉబ్బ‌రానికి , అజీర్ణానికి కార‌ణ‌మ‌వుతాయి. దీని వ‌ల్ల నిద్ర‌కు భంగం క‌లుగుతుంది. వీటికి బ‌దులుగా నీటిని లేదా హెర్బ‌ల్ టీ ల‌ను తాగ‌డం మంచిది. అధిక ప్రోటీన్ క‌లిగిన ఆహారాలు.. అధిక ప్రోటీన్ క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ క‌ష్టంగా మారుతుంది. రాత్రి స‌మ‌యంలో అసౌక‌ర్యంగా ఉంటుంది. క‌నుక‌ రాత్రి భోజ‌నంలో లీన్ ప్రోటీన్ ను త‌క్కువ‌గా తీసుకోవ‌డం మంచిది. డార్క్ చాక్లెట్ లో ఉండే ఆమైనో ఆమ్లాలు, కెఫీన్ రాత్రంతా మ‌నం మేల్కొని ఉండేలా చేస్తాయి. క‌నుక రాత్రి నిద్రించే ముందు డార్క్ చాక్లెట్ ను తీసుకోకూడ‌దు. దీనిని ప‌గ‌టి పూట తీసుకోవ‌డం మంచిది. ఈ ఆహారాల‌న్నీ కూడా నిద్ర‌కు ఆటంకాన్ని క‌లిగిస్తాయి. క‌నుక రాత్రి నిద్రించే ముందు తేలిక‌గా, సుల‌భంగా జీర్ణ‌మయ్యే ఆహారాల‌ను ఎంచుకోవాలి. అలాగే ప‌డుకునే ముందు రెండు లేదా మూడు గంట‌ల ముందుగానే ఆహారాన్ని తీసుకోవాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :