Friday, 13 March 2026 01:53:59 PM
# ఏల్గొండ గూడ పాఠశాలకు దాత సహాయం # నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి # శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి

Tata Institute of Fundamental Research: రోజుకు రెండుసార్లు టీ, కాఫీలు లాగించేస్తారా?.. అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే!

చక్కెరతో టీ, కాఫీలు తీసుకుంటే డయాబెటిస్, ఊబకాయం వచ్చే అవకాశం కూల్‌డ్రింక్స్ కూడా తీసుకుంటే టైప్-2 డయాబెటిస్ వస్తుందన్న టీఐఎఫ్ఆర్ పరిశోధకులు టీ, కాఫీ,

Date : 21 March 2025 10:53 AM Views : 306

Studio18 News - ఆరోగ్యం / : మీరు రోజుకు రెండుసార్లు టీ, కాఫీలు తాగుతారా? అయితే, ఇక నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే. తరచూ టీ, కాఫీలు తాగడంతోపాటు శీతల పానీయాలు తీసుకుంటే మధుమేహంతోపాటు ఊబకాయం వస్తుందని హైదరాబాద్‌లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజుకు రెండుసార్లు చక్కెరతో టీ, కాఫీలు తాగితే డయాబెటిస్‌తోపాటు ఊబకాయం వస్తుందని, కూల్‌డ్రింక్స్ కూడా తీసుకుంటే అదనంగా టైప్-2 మధుమేహం వస్తుందని ప్రొఫెసర్ ఉల్లాస్ ఎస్.కొల్తూర్, ప్రొఫెసర్ మహేందర్ తెలిపారు. రెండేళ్లపాటు ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసినట్టు చెప్పారు. ఈ ప్రయోగ ఫలితాలను అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం చేసిన గ్లోబల్ డైటరీ డేటాబేస్‌‌తో సరిపోల్చారు. తమ పరిశోధన పత్రాన్ని ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘న్యూట్రిషనల్ బయో కెమిస్ట్రీ’లో ప్రచురించినట్టు తెలిపారు. టీ, కాఫీ, కూల్‌డ్రింక్‌లలో ఉండే సుక్రోజ్ కారణంగా కాలేయం, కండరాలు, చిన్న పేగులపై తీవ్ర ప్రభావం పడుతున్నట్టు అధ్యయనంలో తేలింది. కాబట్టి, టీ, కాఫీలను చక్కెర లేకుండా తీసుకునేందుకు ప్రయత్నించాలని, ఇక కూల్‌డ్రింక్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని వారు వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :