Wednesday, 11 March 2026 11:43:25 AM
# సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన # అంగన్వాడీ టీచర్ ఒడ్డేపల్లి రాజేశ్వరికు బెస్ట్ టీచర్ అవార్డు # టేకులబస్తిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ స్లాబ్ పనులు ప్రారంభం # విలేకరి చంద్రశేఖర్‌పై నమోదైన కేసు రద్దు చేయాలి: బీజేపీ నాయకుడు కొయ్యల ఏమాజి # బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ కూనురాజుల సమ్మక్కకు పిహెచ్డీ డాక్టరేట్ # మందమర్రి పెద్ద మసీదులో రంజాన్ తోఫా కార్యక్రమం… మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొనం # నాగర్ గూడ శివారులో సీజ్ చేసిన ఇసుకకు బహిరంగ వేలం # బీజేపీ పోరాటంతో భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాలు # కోమట్లగూడెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి జాతర సందర్భంగా డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం # కుషాయిగూడలో ఘనంగా రేణుక ఎల్లమ్మ–జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం

Legs Pain | కాళ్లు లేదా పాదాలు విప‌రీతమైన‌ నొప్పిగా ఉన్నాయా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

శారీర‌క శ్ర‌మ లేదా వ్యాయామం అధికంగా చేసిన‌ప్పుడు, వాకింగ్‌, ర‌న్నింగ్ ఎక్కువ సేపు చేసినా, లేదా ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా మ‌న‌క‌కు అప్పుడ‌ప్పుడు కాళ

Date : 13 October 2025 07:04 PM Views : 249

Studio18 News - ఆరోగ్యం / : Legs Pain | శారీర‌క శ్ర‌మ లేదా వ్యాయామం అధికంగా చేసిన‌ప్పుడు, వాకింగ్‌, ర‌న్నింగ్ ఎక్కువ సేపు చేసినా, లేదా ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా మ‌న‌క‌కు అప్పుడ‌ప్పుడు కాళ్ల నొప్పులు వ‌స్తుంటాయి. సాధార‌ణంగా ఒక రోజు విశ్రాంతి తీసుకుంటే ఈ నొప్పుల నుంచి ఉప‌శ‌మనం ల‌భిస్తుంది. అయితే కొంద‌రికి కాళ్ల నొప్పులు అంత త్వ‌ర‌గా త‌గ్గ‌వు. పైగా పోష‌కాహార లోపం, అసౌకర్య‌వంత‌మైన పాద‌ర‌క్ష‌ల‌ను ధ‌రించ‌డం, ఆర్థ‌రైటిస్‌, అధికంగా బ‌రువు ఉండ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కాళ్ల నొప్పులు వ‌స్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది క‌లుగుతుంది. అయితే ఈ నొప్పులు త‌గ్గేందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే ప‌లు ప‌దార్థాల‌తోనే స‌హ‌జ‌సిద్ధంగా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అందుకు గాను పలు చిట్కాల‌ను పాటించాల్సి ఉంటుంది. ఎప్సం సాల్ట్‌, నీల‌గిరి తైలం.. ఒక బ‌కెట్‌లో స‌గం వ‌ర‌కు గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తీసుకుని అందులో కాస్త ఎప్సం సాల్ట్‌ను వేసి క‌లిపి ఆ బకెట్‌లో కాళ్లను ముంచి ఉంచాలి. ఇలా 15 నిమిషాల పాటు ఉంచితే నొప్పుల నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే వేడి నీటిలో ట‌వ‌ల్‌ను ముంచి దాంతో కాప‌డం పెడుతున్నా కూడా నొప్పులు తగ్గిపోతాయి. కాళ్లు లేదా పాదాల నొప్పుల‌ను త‌గ్గించేందుకు నీల‌గిరి తైలం బాగా ప‌నిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పులు, వాపుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించేలా చేస్తాయి. ఒక బకెట్ లో వేడి నీటిని పోసి అందులో కొద్దిగా నీలగిరి తైలం వేయాలి. అనంతరం అందులో కాళ్ళను ఉంచాలి. మోకాళ్ళ వరకు కాళ్ళను బకెట్ లో ముంచి ఉంచాలి. 15 నిమిషాల పాటు కాళ్ళను అలా ఉంచితే కాళ్ళ నొప్పులు తగ్గుతయి. తర్వాత కాళ్ళను బయటికి తీసి సాధారణ నీటితో కడుక్కోవాలి. దీంతో కాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం ల‌భిస్తుంది. పుదీనా టీ, మెంతుల నీళ్లు.. నీల‌గిరి తైలంకు బ‌దులుగా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను కూడా ఉయోగించ‌వ‌చ్చు. దీంతో కూడా కాళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఇక నొప్పి ఉన్న ప్ర‌దేశంపై మంచు ముక్క‌లు ఉండే ఐస్ ప్యాక్‌తోనూ కాపడం పెట్టినట్లు పెట్టాలి. కొద్ది నిమిషాల పాటు మ‌ర్దనా చేసిన‌ట్లు ఐస్ ప్యాక్‌ను రాయాలి. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. వాపులు త‌గ్గుతాయి. కాళ్ల నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. పుదీనా ఆకుల‌తో టీ త‌యారు చేసుకుని తాగడం వ‌ల్ల కూడా కాళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు నొప్పులు, వాపుల‌ను త‌గ్గిస్తాయి. అలాగే రెండు గ్లాసుల నీటిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతుల‌ను రాత్రిపూట‌ నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉదయాన్నే ప‌ర‌గ‌డుపునే ఆ నీటిని తాగాలి. మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు నొప్పుల‌ను త‌గ్గిస్తాయి. విట‌మిన్ డి ఆహారాలు.. విట‌మిన్ డి లోపం ఉన్న‌వారిలోనూ కాళ్లు లేదా కండ‌రాలు నొప్పుల‌కు గుర‌వుతుంటాయి. క‌నుక విట‌మిన్ డి ఉండే ఆహారాల‌ను తింటున్నా కూడా ఈ స‌మ‌స్య త‌గ్గుతుంది. విట‌మిన్ డి మ‌న‌కు ఎక్కువ‌గా చేప‌లు, మాంసం, కోడిగుడ్డు ప‌చ్చ సొన‌, తృణ ధాన్యాలు, పుట్ట గొడుగులు, సోయా మిల్క్‌, ఓట్ మీల్ వంటి ఆహారాల‌లో ల‌భిస్తుంది. అలాగే నిత్యం ఉద‌యాన్నే కొంత సేపు సూర్య‌ర‌శ్మిలో నిల‌బ‌డాలి. దీంతో కూడా మ‌న‌కు విట‌మిన్ డి ల‌భిస్తుంది. ఇలా ప‌లు చిట్కాల‌ను పాటిస్తూ ఆయా ఆహారాల‌ను తింటుంటే కాళ్లు, పాదాల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :