Sunday, 15 March 2026 02:11:15 PM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

Breast Cancer: మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌కు నిద్రలేమికి సంబంధం.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు!

Date : 26 December 2025 07:59 PM Views : 121

Studio18 News - ఆరోగ్యం / : నైట్ షిఫ్టులు చేసే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు శరీర జీవ గడియారం దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణమని వెల్లడి రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి క్యాన్సర్ కణాల పెరుగుదలకు ఆస్కారం టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో కీలక అంశాలు తరచూ నైట్ షిఫ్టులలో పనిచేయడం లేదా వేర్వేరు టైమ్ జోన్‌లకు విమాన ప్రయాణాలు చేయడం వంటి కారణాలతో నిద్ర సమయాలు అస్తవ్యస్తంగా మారే మహిళలు వేగంగా రొమ్ము క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. శరీరంలోని 'జీవ గడియారం' (Circadian Rhythm) దెబ్బతినడం వల్ల రొమ్ము గ్రంథుల నిర్మాణంలో మార్పులు రావడంతో పాటు రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. ఈ పరిశోధనలో భాగంగా... బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేలా జన్యుపరంగా మార్పులు చేసిన ఎలుకలను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపును సాధారణ పగలు-రాత్రి వాతావరణంలో, మరో గ్రూపును అస్తవ్యస్తమైన లైటింగ్ పరిస్థితుల్లో ఉంచి వాటి జీవ గడియారానికి అంతరాయం కలిగించారు. సాధారణ పరిస్థితుల్లో ఉన్న ఎలుకలకు 22 వారాల సమయంలో క్యాన్సర్ రాగా, నిద్రకు ఆటంకం కలిగిన గ్రూపులో కేవలం 18 వారాలకే క్యాన్సర్ లక్షణాలు కనిపించాయి. "మన అంతర్గత గడియారం దెబ్బతింటే, క్యాన్సర్ దానిని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది" అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ తపశ్రీ రాయ్ సర్కార్ తెలిపారు. నిద్ర సమయాలు మారిన ఎలుకలలో క్యాన్సర్ కణితులు వేగంగా పెరగడమే కాకుండా, ఊపిరితిత్తులకు కూడా వ్యాపించాయని గుర్తించారు. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ రోగులలో ప్రమాదానికి సంకేతంగా భావిస్తారు. శరీర జీవ గడియారం దెబ్బతినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగించి, క్యాన్సర్ కణాలు సులభంగా పెరిగేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని సర్కార్ వివరించారు. అంతేకాకుండా ఆరోగ్యవంతమైన రొమ్ము కణజాలంలో కూడా మార్పులు వచ్చి, భవిష్యత్తులో క్యాన్సర్‌కు మరింత ఎక్కువ ఆస్కారం కలుగుతోందని ఈ అధ్యయనం తేల్చింది. ఈ పరిశోధన వివరాలు 'ఆంకోజీన్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :