Wednesday, 11 March 2026 11:41:35 AM
# సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన # అంగన్వాడీ టీచర్ ఒడ్డేపల్లి రాజేశ్వరికు బెస్ట్ టీచర్ అవార్డు # టేకులబస్తిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ స్లాబ్ పనులు ప్రారంభం # విలేకరి చంద్రశేఖర్‌పై నమోదైన కేసు రద్దు చేయాలి: బీజేపీ నాయకుడు కొయ్యల ఏమాజి # బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ కూనురాజుల సమ్మక్కకు పిహెచ్డీ డాక్టరేట్ # మందమర్రి పెద్ద మసీదులో రంజాన్ తోఫా కార్యక్రమం… మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొనం # నాగర్ గూడ శివారులో సీజ్ చేసిన ఇసుకకు బహిరంగ వేలం # బీజేపీ పోరాటంతో భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాలు # కోమట్లగూడెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి జాతర సందర్భంగా డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం # కుషాయిగూడలో ఘనంగా రేణుక ఎల్లమ్మ–జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం

Cumin Water On Empty Stomach | జీల‌క‌ర్ర నీళ్ల‌ను రోజూ ప‌ర‌గ‌డుపున తాగితే ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి. భార‌తీయ వంట‌కాల్లో జీల‌క‌ర్ర ముఖ్య‌పాత్ర పోషిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దాదాపు మనం చేసే అన్ని

Date : 27 December 2025 07:45 PM Views : 100

Studio18 News - ఆరోగ్యం / : Cumin Water On Empty Stomach | మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి. భార‌తీయ వంట‌కాల్లో జీల‌క‌ర్ర ముఖ్య‌పాత్ర పోషిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దాదాపు మనం చేసే అన్ని వంట‌కాల్లో జీల‌క‌ర్ర‌ను వాడుతూ ఉంటాం. వంట‌ల‌కు చ‌క్క‌టి రుచి తీసుకు రావ‌డంలో జీల‌క‌ర్ర పాత్ర ఎంతో ఉంది. జీల‌క‌ర్ర‌లో ఔష‌ధ గుణాల‌తో పాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పొటాషియం, క్యాల్షియం, సెలీనియం, రాగి, మాంగ‌నీస్ వంటి పోష‌కాలు కూడా ఎన్నో ఉన్నాయి. జీల‌క‌ర్ర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. జీల‌క‌ర్ర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డమే కాకుండా జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం వ‌ల్ల కూడా మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ప‌ర‌గ‌డుపున ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వారు అంటున్నారు. ర‌క్తహీన‌త‌కు చెక్‌.. జీల‌క‌ర్ర నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవ‌క్రియ పెరుగుతుంది. తద్వారా శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌ర‌గ‌డంతోపాటు శ‌రీర బ‌రువు కూడా అదుపులో ఉంటుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు జీల‌క‌ర్ర నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల వేగంగా బ‌రువు త‌గ్గుతారు. జీల‌క‌ర్ర నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. త‌రుచూ ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డే వారు జీల‌క‌ర్ర నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో కూడా జీల‌క‌ర్ర నీరు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. జీల‌క‌ర్ర‌లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఐర‌న్ త‌క్కువ‌గా ఉన్న‌వారు, హిమోగ్లోబిన్ స్థాయిలు త‌క్కువ‌గా ఉన్న‌వారు రోజూ జీల‌క‌ర్ర నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎంతో మేలు క‌లుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గేందుకు.. జీల‌కర్ర జీర్ణ ఎంజైమ్ ల‌ను ప్రేరేపిస్తుంది. జీల‌క‌ర్ర నీటిని తాగ‌డంవ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. అజీర్తి, గ్యాస్, ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. చ‌క్క‌టి పొట్ట ఆరోగ్యానికి జీల‌క‌ర్ర నీరు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. జీల‌క‌ర్ర నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. ట్రైగ్లిజ‌రాయిడ్ స్థాయిలు కూడా త‌గ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అధిక కొలెస్ట్రాల్ స‌మస్య‌తో బాధ‌ప‌డే వారికి జీల‌క‌ర్ర నీరు ఎంతో మేలు చేస్తుంది. ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారికి కూడా జీల‌క‌ర్ర నీరు మేలు చేస్తాయి. జీల‌క‌ర్ర నీటిలో పొటాషియం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది ర‌క్తపోటును అదుపులో ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. లివ‌ర్‌, కిడ్నీల ఆరోగ్యానికి.. జీల‌క‌ర్ర నీరు డిటాక్స్ డ్రింక్ గా కూడా ప‌నిచేస్తాయి. ఈ నీటిని తీసుకోవ‌డం వల్ల శ‌రీరంలో వ్య‌ర్థాలు తొల‌గిపోతాయి. కాలేయం, మూత్ర‌పిండాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జీల‌క‌ర్ర నీటిని తీసుకోవ‌డం వల్ల చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ర‌క్తంలో చ‌క్కెర‌ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ఈ విధంగా జీల‌క‌ర్ర నీరు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ నీటిని ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక ఈ నీటిని మ‌నం రెండు విధాలుగా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర వేసి రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే వ‌డ‌క‌ట్టి తీసుకోవ‌చ్చు. అలాగే ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ జీల‌క‌ర్ర వేసి బాగా మ‌రిగించి వ‌డ‌క‌ట్టి తాగ‌వ‌చ్చు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :