Friday, 13 March 2026 02:01:15 PM
# ఏల్గొండ గూడ పాఠశాలకు దాత సహాయం # నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి # శ్రీపాద ఎల్లంపల్లి నీరు రుద్రంగికి చేరిక… రైతుల్లో ఆనందం # ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమానికి యువత ముందుకు రావాలి: కలెక్టర్ రాజర్షి షా # వేములవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు – 8 మందికి జైలు శిక్ష, 106 మందికి జరిమానాలు # వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి హుండీ ద్వారా రూ.2.16 కోట్ల ఆదాయం # పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ లేమి – గర్భిణీలకు ఇబ్బందులు # నిర్మల్ జిల్లాలో నారి శక్తి కార్యక్రమం: డయల్-100కు సత్వర స్పందన, అవగాహన కార్యక్రమాలు # పదవ తరగతి విద్యార్థినులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ # జన్నారం మండలంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శిక్షణ ముగింపు కార్యక్రమం # ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిద్దాం: కలెక్టర్ అభిలాష అభినవ్ # వనస్థలిపురంలో గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు # ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు శిక్షణ # పీజీ సీట్లు సాధించిన వైద్యులకు బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం # షాబాద్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య # పలు వివాహ వేడుకలకు హాజరైన మల్‌రెడ్డి రాంరెడ్డి # బంజారా మహిళ హత్యపై నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ # నూతన వధూవరులను ఆశీర్వదించిన దేప భాస్కర్ రెడ్డి

ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు నిఘా కోసం త్వరలో స్మార్ట్ టాయిలెట్లు: డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి

Date : 19 May 2025 12:20 PM Views : 344

Studio18 News - ఆరోగ్యం / : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో పనిచేసే స్మార్ట్ టాయిలెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని, ఇవి మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తం చేస్తాయని ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణులు, పద్మ విభూషణ్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇటీవల కర్నూలు పర్యటనకు విచ్చేసిన ఆయనను స్థానిక వైద్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ఆధునిక వైద్య విధానాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో గుండె, కిడ్నీ, కాలేయం వంటి అవయవాలే ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయని భావించేవారని, కానీ ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యానికి "గట్ హెల్త్" (జీర్ణవ్యవస్థ ఆరోగ్యం) కీలకమని స్పష్టమైందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వివరించారు. మన శరీరంలోని మైక్రోబయోమ్.. బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్ వంటి సూక్ష్మజీవుల సమూహం. శరీర విధులను నియంత్రిస్తూ గట్ హెల్త్‌ను, తద్వారా పూర్తి శారీరక ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుందని తెలిపారు. ఈ సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతిని, హానికారక బ్యాక్టీరియా పెరిగితే అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. గట్ హెల్త్ అనేది వైద్యశాస్త్రంలో ఒక సరికొత్త, కీలకమైన అంశంగా మారిందన్నారు. శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి రెండు మార్గాలున్నాయని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రోబయాటిక్స్ ద్వారా నేరుగా మంచి బ్యాక్టీరియాను అందించవచ్చని, పెరుగు, మజ్జిగ వంటివి ఇందుకు ఉదాహరణలని చెప్పారు. ఇక ప్రీబయాటిక్స్ అంటే మనం తీసుకునే ఆహారం ద్వారా మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని, ఉల్లిపాయలు, అరటిపండ్లు, కొబ్బరి నీళ్లు వంటివి ప్రీబయాటిక్స్‌గా పనిచేస్తాయని వివరించారు. రోజూ రెండు గ్లాసుల కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని సూచించారు. గట్ హెల్త్‌కు, గుండె జబ్బులకు మధ్య సంబంధం ఉందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసే ‘టీఎంఏఓ’ అనే రసాయనం శరీరంలో ఎక్కువైతే గుండెపోటు, గుండె వైఫల్యం వంటి సమస్యలు రావొచ్చని హెచ్చరించారు. ఈ బ్యాక్టీరియాను నియంత్రించడం ద్వారా గుండె జబ్బుల ముప్పు తగ్గించుకోవచ్చన్నారు. అదేవిధంగా అల్జీమర్స్ వ్యాధి, మెదడు పనితీరు, తెలివితేటలు కూడా బ్యాక్టీరియాతో ముడిపడి ఉన్నాయని, బ్యాక్టీరియాలో మార్పుల ద్వారా వీటికి చికిత్స చేసే పరిశోధనలు జరుగుతున్నాయని వెల్లడించారు. త్వరలోనే ఏఐ సాంకేతికతతో పనిచేసే స్మార్ట్ టాయిలెట్లు అందుబాటులోకి వస్తాయని, ఇవి మన మల, మూత్రాలను విశ్లేషించి ఎప్పటికప్పుడు ఆరోగ్యం గురించి సమాచారం అందిస్తాయని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చెప్పారు. అలాగే, స్టూల్ క్యాప్సూల్స్ ద్వారా అనేక జబ్బులను నయం చేయవచ్చని తెలిపారు. ఆరోగ్యవంతుల మలాన్ని సేకరించి, దాన్ని శుద్ధి చేసి, పొడి రూపంలోకి మార్చి క్యాప్సూల్స్‌లో అందిస్తారని, దీనివల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియాను ప్రవేశపెట్టవచ్చని వివరించారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, చిప్స్, నూడిల్స్ వంటివి పిల్లల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నాయని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆహార పదార్థాల్లోని ప్రిజర్వేటివ్‌లు, కలరింగ్ ఏజెంట్ల వల్ల శరీరంలోని బ్యాక్టీరియా దెబ్బతింటోందని, ఇది కేవలం అధిక క్యాలరీల సమస్య కాదని స్పష్టం చేశారు. పాఠశాలల పరిసరాల్లో, క్యాంటీన్లలో ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ అమ్మకాలను నిషేధించాలని, తద్వారా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఆయన సూచించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ ఆహారం ఆరోగ్యకరమైనదో, ఏది మంచి బ్యాక్టీరియాను పెంచుతుందో అనేదానిపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. గ్రీస్ వంటి దేశాల్లో పాటించే ‘మెడిటరేనియన్ డైట్’ చాలా ఆరోగ్యకరమైనదని, దీనిని భారతీయ ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ‘ఇండో-మెడిటరేనియన్ డైట్’గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. చివరగా, మంచి ఆరోగ్యం కోసం స్థానికంగా, సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమమని ఆయన సలహా ఇచ్చారు. రసాయన ఎరువులు వాడిన పంటలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, పాశ్చాత్య ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి హానికరం అన్నారు. సరైన మోతాదులో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, నూనెలు కలిగిన, మన ప్రాంతంలో పండిన సహజ సిద్ధమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :